కరోనా కట్టడి చేతకాక మాపై విమర్శలా!
` అమెరికాపై విరుచుకుపడ్డ చైనా
బీజింగ్,ఏప్రిల్ 28(జనంసాక్షి):పదేపదే తమపై విమర్శు చేస్తున్న అమెరికాపై చైనా ప్రతి దాడికి దిగింది. అక్కడి రాజకీయ నాయకు నిర్మొహమాటంగా అబద్ధాు చెప్పేస్తున్నారని విమర్శించింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.‘వాళ్ల (అమెరికా నాయకు)ది ఒకే క్ష్యం. కరోనా కట్టడి బాధ్యత నుంచి తప్పించుకోవడం. చర్యు తీసుకోకుండా ప్రజ దృష్టి మళ్లించడం’ అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ అన్నారు. అమెరికా రాజకీయ నాయకు మొహమాటం లేకుండా అబద్ధాు ఆడుతున్నారని, అవాస్తవాు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మొదట చైనాలోని వుహాన్‌లో మెగుచూసింది. దానిని అంటువ్యాధిగా, మహమ్మారిగా గుర్తించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా కలిసి అసత్వం వహించాయని అనుమానాు ఉన్నాయి. వాటి ఆధారంగానే అమెరికా సహా అనేక దేశాు డ్రాగన్ దేశంపై గుర్రుగా ఉన్నాయి. అయితే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చైనా నుంచి ఏకంగా పరిహారం కోరేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడం గమనార్హం.‘మేం చైనా పట్ల సంతోషంగా లేం. ఎందుకంటే వైరస్ ఆవిర్భవించిన చోటే దానిని ఆపే అవకాశముందని మేం విశ్వసిస్తున్నాం. కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించకుండా వేగంగా అడ్డుకోవాల్సి ఉండేది. అందుకే వారిని బాధ్యు చేయడం మినహా మరో అవకాశం లేదు’ అని ట్రంప్ అన్న సంగతి తెలిసిందే.