కరోనా మరణాు సంఖ్యను 50 శాతం పెంచిన వుహాన్
వుహాన్,ఏప్రిల్ 17(జనంసాక్షి): కరోనా వైరస్ మృతు సంఖ్యను వుహాన్ నగరం రెట్టింపు చేసింది. ముందు వ్లెడిరచిన దాని కన్నా.. 50 శాతం ఎక్కువ మరణాు నమోదు అయినట్లు ఆ నగరం పేర్కొన్నది. ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆ నగరంలో 50,333 కేసు పాజిటివ్‌గా తేలియాయి. ఇక మరణించిన వారి సంఖ్యలో అదనంగా 1290 మందిని జోడిరచారు. నిన్నటి వరకు వుహాన్‌లో మరణించిన వారి సంఖ్య 2579గా ఉన్నది. అయితే కొన్ని కారణా వ్ల మరణా లెక్కింపు జరగలేదని, ఆ తప్పును సవరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. తాజా సమాచారం ప్రకారం వుహాన్‌లో 3879 మంది ప్రాణాు కోల్పోయారు. వుహాన్ సంఖ్య పెరగడంతో దేశవ్యాప్తంగా మరణా సంఖ్య 39 శాతం పెరిగింది. దీంతో ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ వ్ల చనిపోయినవారి సంఖ్య 4632గా నిలిచింది.