కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌..

` బీజేపీ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు
బెంగళూర్‌(జనంసాక్షి): ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కుప్పకూల్చే కుయుక్తులకు కాషాయ పార్టీ మళ్లీ పదునుపెడుతోంది. కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌కు తెరలేపుతున్నట్టు స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే వెల్లడిరచారు. పాలక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాష్ట్రంలో ఆపరేషన్‌ లోటస్‌ త్వరలోనే ప్రారంభం కానుందని బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో సగం మంది హస్తం గూటికి చేరతారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నాని కానీ ఏ ఒక్క కాషాయ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోరని స్పష్టం చేశారు. దమ్ముంటే నెలరోజుల్లోగా కనీసం ఒక్క ఎమ్మెల్యేను ఆకర్షించాలని ఆయన కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు.విూ సొంత ఎమ్మెల్యేలకే విూపై నమ్మకం లేదని, దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదని ఈశ్వరప్ప అన్నారు. కాగా ఆలయాలను నిర్మించేందుకు మసీదులను కూలగొట్టాలని ఇటీవల ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.