కర్నాటక వర్షాలపై ప్రధాని మోడీ ఆరా
సిఎం బొª`మయ్‌కు ఫోన్ చేసిన ప్రధాని
బెంగళూరు,నవంబర్ 23జనంసాక్షి: కర్ణాటకలోని భారీ వర్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో రానున్న 48 గంటలపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల ప్రారంభం నుంచి కర్ణాటక వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 హెక్టార్లకు పైగా భూమిలో పంట నష్టం జరిగింది. 191 పశువులు మృత్యువాత పడ్డాయని అఓక్ష ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అంచనా వేసిన ప్రాథమిక ప్రకారం 658 ఇళ్లు పూర్తిగా, 8,495 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని కర్ణాటక విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు వెల్లడిరచారు. ఇళ్లు కూలిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం రోడ్లు, వంతెనల కోసం రూ. 500 కోట్లు విడుదల చేశారు. నగరం చుట్టూ అత్యవసర రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసింది.