కర్నూలులో ఇద్దరి హత్య
కర్నూలు: కర్నూలులోని మానస దాబాలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఏడుగురు మిత్రులు కలిసి దాబాకు వెళ్లారు. వీరిపై 12మంది ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతులు కర్నూలు శ్రీరాంనగర్ వాసులు దొరస్వామిరాజు, ఇమాన్యుయేల్‌గా గుర్తించారు. దొరస్వామి రాజు 2011లో గణేష్‌నగర్‌లో జరిగిన నరసింహులు హత్య కేసులో నిందితుడు