కర్మాన్ ఘాట్ శ్రీ ద్యానంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేసిన :ఏసీపీ రాందాస్ తేజ
ఎల్బీ నగర్ (జనం సాక్షి )అసెంబ్లీ సెంట్రల్ జోన్ ఏసీపీ రాందాస్ తేజ జన్మదినం సందర్భంగా శుక్రవారం కర్మాన్ ఘాట్ శ్రీ ద్యానంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం జరిగింది.. స్వామి వారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని రాందాస్ తేజ ఆ భగవంతుని కోరుకున్నారు.. అనంతరం రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కొండా యాదగిరి అధ్వర్యంలో రామ్ దాస్ తేజను శాలువాతో ఘనంగా సన్మానించి మెమొంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్ శర్మ ధర్మకర్తలు . చేగోని మల్లేష్ గౌడ్, అనిత, యాదగిరి, జగదీష్ గౌడ్,శ్రీనివాస్, జంగయ్య, శేఖర్ రెడ్డి,చెంప పేట్ డివిజన్ టీఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ , రమాదేవి, సరోజ, చందు, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు…