కలంకితుల రాజీనామాకు డిమాండ్
– రాజ్యసభలో లలిత్ మోదీ రభస
న్యూఢిల్లీ,జులై21(జనంసాక్షి):
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాంధీ తదితరులు సమావేవాలకు హాజరయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ సభకు తెలిపారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిసింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తన్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక రాజ్యసభ సమావేశాలు వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. లలిత్ మోడీకి సహకారంపై సుస్మాస్వరాజ్ పాత్ర ఉన్నందున ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తొలుత గందరగోళం చెలరేగగానే ఛైర్మన్ హవిూద్ అన్సారీ సభను వాయిదా వేవారు. అనంతరం సభ ప్రారంభం అయ్యాక డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను ప్రారంభించగానే వెంటనే విపక్షాలు లలిత్‌గేట్‌పై చర్చకు పట్టుబట్టాయి. లలిత్‌గేట్‌పై ప్రధాని సమాధానం చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్చకు సిద్దమని ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించారు. అయితే సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ రాజ్యసభాపక్ష ఉపనేత ఆనంద్‌శర్మ మాట్లాడుతూ.. లలిత్‌మోదీని భారత్‌కు తీసుకురావాలి. భార్య అనారోగ్యం సాకుగా చూపి లలిత్‌మోదీ విదేశాల్లో తిరుగుతున్నడు. రెడ్ కార్నర్ ఉన్న వ్యక్తులను ఎందుకు పట్టుకోవడం లేదు. ఆయనకు సహకరించిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేలను పదవి నుంచి తప్పించాలని పేర్కొన్నారు. విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతుండటంతో సభా సమావేశాలు సజావుగా నడిచే పరిస్థితి లేకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
సజావుగా సాగేందుకు సహకరించండి
– నరేంద్ర ప్రధాని మోదీ
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని విూడియాతో మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలన్నారు. దేశాభివృద్ధికి కలిసి పనిచేద్దాం. అందరం కలిసి సమష్టి నిర్ణయాలు తీసుకుందాం. సభా సమయాన్ని వృథా చేయకుండా సహకరించాల్సిందిగా కోరారు. అన్ని అంశాలను చర్చించేందుకు సమావేవౄలను ఉపయోగించుకోవాలని అన్నారు ఎన్నో అంశాలను పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నటి అఖిల పక్ష భేటీ పాజిటివ్‌గా జరిగిందన్నారు. ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని అందుకు ఎంపీలంతా సహకరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. సమావేశాలకు సహకరిస్తామని అన్ని పార్టీలు హావిూ ఇచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. సరైన నిర్ణయాలు తీసుకోవటంలో ఎంపీలు తమ పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.సభ సజావుగా సాగేందుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉన్నదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సభ్యులు లేవనెత్తె అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏ విషయాన్ని దాచాల్సిన, దాచి పెట్టాల్సిన అసవరం ప్రభుత్వానికి లేదన్నారు. ఏ అంశంపైన అయినా చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. కాంగ్రెస్ మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఎందుకు అంతగా దిగజారిందో తెలుసుకోవాలని వెంకయ్య అన్నారు. ఇదిలావుంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు లోక్‌సభ స్పీకర్‌తో సుమిత్రా మహాజన్‌తో ప్రధాని, ¬ంమంత్రి, ఆర్థికమంత్రులు భేటీ అయ్యారు.