కలకత్తా హైకోర్టులో సీఎం మమతాకు చుక్కెదురు
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురయ్యింది. ప్రభుత్వం టాటా మోటార్స్ కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి ఇచ్చి వేయడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. తమకు కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవడాన్ని సవాలు చేస్తు టాటా మోటర్స్ హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం దాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. ప్రభుత్వం రూపొందిచింన సింగూరు ల్యాండ్ ఆక్ట్ భూసేకరణ చట్టంను కొట్టివేసింది. ఈ చట్టం రూపొందించడంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించనేచ లేదని తీర్పు లో పేర్కోంది. తీర్పు పై సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడానికి రెండు నెలల గడువు విధిస్తున్నట్టు తెలిపింది.