కలకలం రేపుతున్న పులి సంచారం
రంగారెడ్డి,ఫిబ్రవరి24(జనంసాక్షి): యాచారం మండలం నక్కర్త మేడిపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. నక్కర్త గ్రామానికి చెందిన రైతు మైసయ్యకు చెందిన ఆవు దూడపై పులి దాడి చేసింది. ఈ పులి దాడిలో ఆవుదూడ అక్కడిక్కడే చనిపోయింది. ఆవుపై దాడి చేసిన తర్వాత పులి గ్రామంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి సవిూపంలో అటవీ ప్రాంతం ఉండటంతో క్రూర జంతువులు వస్తున్నట్లు చెబుతున్నారు. ఏ క్షణంలో తమపై దాడి చేస్తాయోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకి పోతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పులి పట్టుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.