కలసి వచ్చిన తుఫాన్ వర్షాలు
నాలుగేళ్ల తరవాత సాగర్‌కు పూర్తిస్థాయిలో నీరు
కళకళలాడుతున్న ప్రధాన జలాశయాలు
నల్లగొండ/మహబూబ్‌నగర్,ఆగస్ట్25(జనం సాక్షి): ఇటీవలి తుఫాన్ వర్షాలు కలసి వచ్చాయి. గతకొన్నేళ్లుగా జలకళ తప్పిన ప్రధాన ప్రాజెక్టులు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. వాయుగుండాల కారణంగా కురిసిన వర్షౄలతో శ్రీశైలం,నాగార్జునసాగర్‌లకు భారీగా వరదనీరు చేరింది. ఈ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌లోని దాదాపు అన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భారీ వర్షాలు కురవడంతో కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలం జలాశయానికి లక్షా 98 వేల 774 క్యూసెక్కుల వరద వస్తుండగా.. క్రస్టు గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా.. 2.11 లక్షల క్యూసెక్కులకు నీరు విడుదలవుతోంది. ఇటు నాగార్జునసాగర్‌కు శుక్రవారం సాయంత్రం 1.82 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ప్లో ఉన్నది. జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం 565.40 అడుగులకు చేరగా.. 245.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరో మూడురోజుల పాటు నాగార్జునసాగర్‌కు ఇన్‌ఎ/-లో భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర కాస్త పుంజుకున్నా.. ఆల్మట్టి ఇన్‌ప్లో స్థిరంగా కొనసాగినా.. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకునేందుకు ఢోకా లేదు. నాలుగైదు రోజులపాటు ఉధృతంగా కొనసాగిన శ్రీరాంసాగర్ ఇన్‌ఎ/-లో రెండు, మూడు రోజులుగా భారీగా తగ్గింది. పదివేల లోపు క్యూసెక్కుల వరద మాత్రమే వస్తున్నది. 70 టీఎంసీల వరకు వేగంగా పెరిగిన నీటిమట్టం ఆపై నెమ్మదిగా పెరుగుతున్నది.ముఖ్యంగా కాకతీయ కాల్వకు 5500 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ఇతరత్రా అవుట్ ఎ/-లోలు నమోదవుతున్న దరిమిలా వస్తున్న ఇన్‌ఎ/-లో సరిపోతున్నది. దీంతో జలాశయంలో 70 టీఎంసీల నీటి నిల్వ నిలకడగా ఉన్నది. జల విద్యుత్ కేంద్రంలో మూడు టర్బయిన్ల ద్వారా 18.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఇక నాలుగేండ్ల తర్వాత నాగార్జునసాగర్‌కు జలకళ కలిసివచ్చినా.. దాని దిగువన ఉన్న పులిచింతల మాత్రం వెలవెలబోతున్నది. ముఖ్యంగా ఎగువన సాగర్ వరకు ఇన్‌ప్లోలు ఉండటంతో పాటు పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీకి కూడా భారీ ఇన్‌ప్లోలు నమోదయ్యాయి. శుక్రవారం కూడా 14,485 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 38.637 టీఎంసీల కృష్ణాజలాలు సముద్రంలో కలిశాయి. కానీ పులిచింతల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 9.93 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ప్రస్తుతం మూడువేల క్యూసెక్కుల పైచిలుకు వరదతో ప్రాజెక్టులో 6.04 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
తగ్గుముఖం పట్టిన గోదావరి
మరోవైపు గోదావరి ఉగ్రరూపం తగ్గుముఖం పట్టింది. పెరూరు దగ్గర 10.60 విూటర్ల ఎత్తులో ప్రవాహం 5.63 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతున్నది. ధవళేశ్వరం నుంచి అధికారులు 11.12 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 1688.152 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి.