కలాం మిషన్ డైరెక్టర్ కాకపోవడం వల్లే రాకెట్ కూలిపోయింది: అప్పటి ప్రధాని ఇందిర వ్యాఖ్య

చెన్నై: నెల్లూరులోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఓ ప్రయోగానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఆ ప్రయోగం విఫలమై రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఆ రాకెట్ మిషన్‌కు అబ్దుల్ కలాం డైరెక్టర్‌గా వ్యవహరించలేదని ఎవరో చెప్తే తెలుసుకున్న ఆమె తనతో మాట్లాడుతూ రాకెట్‌ కూలిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నారట కలాంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పీటీఐ జర్నలిస్ట్ నిశాత్ అహ్మద్ చెప్పిన విషయమిది. ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలో మీడియాపై ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆరోజుల్లో మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రయోగ కేంద్రంలోని అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేవారమని పేర్కొన్నాడు. అంతేకాదు శాస్త్రవేత్తలతో ఒకే గెస్ట్‌హౌస్‌లో ఉండేవాళ్లమని కూడా నిశాత్‌ వివరించారు. అగ్ని మిసైల్‌ను టెస్టింగ్ చేసే సందర్భంలో ఒడిషాలోని చాందీపుర్ బీచ్‌లో అబ్దుల్ కలాంతో చాటింగ్ చేశామని తెలిపాడు. ఆ రకంగా కలాంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.