కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత పలువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో విద్యార్థులను పాఠశాల సిబ్బంది పాల్వంచ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.