కలెక్టరుపై సీఎంకు ఫిర్యాదు
అదిలాబాద్ : పత్తి కోనుగోళ్ల విషయంలో కలెక్టర్ అశోక్ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని. అయనను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ అఖిల పక్షం నేతలు ఈ రోజు ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తేమలో సంబందం లేకుండా పత్తి కోనుగోళ్లు .జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వారిని అదుకునేందుకు ప్రభుత్వరంగ సంస్థల ద్వారా వాణిజ్య కోనుగోళ్లు చేయించాలని విజ్ఞప్తి చేశారు