కలెక్టరు కార్యాలయం ఎదుట వామపక్ష ,భాజపాల ఆందోళన దీక్షలు
ఖమ్మం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష, భాజపాలు జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ సర్‌ఛార్జీల పేరిట రూ. 3వేల భారం మోపిన ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచి మరో 6వేల కోట్ల భారం మోపిందన్నారు. దీనికి నిరసనగా ఈనెల 9న చేపట్టిన బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్వక్షుడు కొండబాల కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.