కలెక్టరేట్‌ పరిశుభ్రతపై పకడ్బందీ చర్యలు

కరీంనగర్‌ సిటీబ్యూరో, మే 16 కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయంలో పరిశువూభత పాటించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి కె. కృష్ణాడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని వారి ఛాంబర్‌లో అన్ని కార్యాలయాల పర్యవేక్షకులతో గురువారం పరిశువూభత చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయాలకు వెంటనే రంగులు మేయించాలన్నారు. కలెక్టరేట్‌కు అవసరమైన అన్ని మరమ్మతులు. ప్లంబింగ్‌ పనులను సాంఘిక సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా చేయిస్తామని పేర్కొన్నారు.