కలెక్టరేట్ వద్ద భాజపా దీక్షలు
ఖమ్మం సంక్షేమం: విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ వద్ద భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహా రదీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా వీటిని కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఛార్జీలు తగ్గించే వరకు దీక్షను కొనసాగిస్తామని అన్నారు. దీక్షల్లో నాయకులు విద్యాసాగర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.