కలెక్టర్ ఆదేశించిన…కదలని మున్సిపల్ అధికారులు
అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాన్ని బలితీసుకుందని
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శాంతినగర్ కాలనీవాసులు
సిరిసిల్ల. నవంబర్ 15. (జనం సాక్షి). తమ కష్టాలను తెలుపుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని స్పందించిన కలెక్టర్ మున్సిపల్ అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన స్పందించకపోవడంతో నిండు ప్రాణం బలైందని శాంతినగర్ 2 వ వార్డు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీటిలో పడి ప్రాణం కోల్పోయిన టైల్స్ కార్మికుడు మృతి తో శాంతినగర్ లో విషాద చాయలు అలుముకున్నాయి. మంగళవారం కాలనీవాసులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాపీ నీ చూపిస్తూ తమ ఇబ్బందులను తెలిపారు.తమ ఆవేదన ను అర్థం చేసుకున్న కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులకు పరిస్థితి చక్కదిద్దలంటు ఆదేశించిన స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలువురు జారిపడి గాయాల పాలైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడు ఏకంగా ఓ నిరుపేద కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందంటూ ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పరిస్థితినీ చక్కదిద్దాలని కోరుతున్నారు…