కల్తీకల్లు మరణాలు లేవట!

1

– సభలో మంత్రి పద్మారావు

హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనంసాక్షి):

ఓ వైపు కల్తీ కల్లు మరణాలతో రాష్ట్రం అట్టుడుతుంటే కల్తీకల్లు తాగి ఇప్పటివరకు ఎవరూ మరణించినట్లుగా అధికారిక సమాచారమేది లేదని ఎక్సైఝ్‌ శాఖ మంత్రి పద్మారావుగౌడ్‌ శాసనసభలో ప్రకటించారు.  శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో  సంక్షేమం, కల్తీకల్లు నివారణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ.. కల్తీకల్లు తాగి ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదన్నారు. అయితే కొందరు  కల్లుకు బానిసలై మాత్రమే చనిపోయినట్లుగా సమాచారం ఉందని మంత్రి అన్నారు.  కల్తీకల్లు వల్ల చనిపోయినట్లుగా వస్తున్న వార్తలన్నీ అసత్యాలన్నారు.  కల్తీ కల్లు వల్ల చనిపోయినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని పద్మారావు చెప్పారు. కల్లుకు బానిసలై చనిపోలేదని మంత్రి పేర్కొన్నారు. కల్లీ కల్లు కాటుకు తెలంగాణలో మరణిస్తున్నా అవి వాస్తవం కాదని మంత్రి ప్రకటించడం విశేషం. గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.200 నుంచి వెయ్యికి పెంచామన్నారు. చనిపోయిన గీత కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షలకు పెంచామన్నారు. శాశ్వత వైకల్యం పొందిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి ప్రకటించారు. చనిపోయిన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాం. అదేవిధంగా శాశ్వత వైకల్యం పొందినా రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వర్తించేలా నిర్ణయించాంమన్నారు. . చనిపోయిన గీత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. . హారితహారం కింద తాటిచెట్ల పెంపకం చేపట్టనున్నామన్నారు. దాదాపు ఐదుకోట్ల తామి మొక్కలు పెంచాలని నిర్ణయించామన్నారు. . ఛత్తీస్‌గడ్‌, కేరళ రాష్ట్రాల నుంచి తాటి మొక్కలు తెపిస్తామని, గీత కార్మికులకు ఆధునిక టెక్నాలజీ పరికరాలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు