కల్తీ బియ్యం అమ్మితే చర్యలు
పామూరు , జూలై 26 : రైస్ మిల్లర్లు కల్తీ బియ్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్‌పెక్టర్ షేక్ షమీద్ హెచ్చరించారు. గురువారం మండలంలోని రైస్‌మిల్లర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యంను కొనుగోలు చేసి పాలిష్ పట్టి అధిక ధరలకకు విక్రయించే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిపిటి సన్నాలు బియ్యం 29 రూపాయలకు, 74 రకం బియ్యం 27 రూపాయలకు విక్రయించాలని మిల్లర్లకు సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ సూచనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడే మిల్లర్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దారు షేక్ దావూద్ హేస్సేన్ ఉన్నారు.