కల్లు మాపీయాపై కఠిన చర్యలు

2

మంత్రి పోచారం

మెదక్‌,సెప్టెంబర్‌16(జనంసాక్షి):

తెలంగాణపై మొదటి నుంచి కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమే అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి ఆ రెండు పార్టీలే కారణమని ధ్వజమెత్తారు. విూ పాలనలో రైతాంగానికి ఎన్నడైనా సక్కగ కరెంట్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా తెలంగాణ నుంచి ప్రవహిస్తుంటే ఇన్నేళ్లు నీళ్లేందుకు ఇవ్వలేదు అని అడిగారు. ప్రాణహిత ప్రాజెక్టు కట్టకుండానే కాల్వలు తవ్వారు. రైతుల ఆత్మహత్యలు బాధాకరం. ఇప్పటికీ 162 మందికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని తెలిపారు. ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేతలు గల్లీలో కాదు.. ఢిల్లీలో లొల్లి చేయాలని సూచించారు. చేతనైతే రైతు యూనిట్‌ పాలసీ బిల్లును పాస్‌ చేయించడని చెప్పారు. రైతు యూనిట్‌ పాలసీ బిల్లు పాస్‌ అయితే వెంటనే రైతు ఆత్మహత్యలు ఆగిపోతాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఆత్మహత్యలెందుకు ఉంటాయన్నారు. త్వరలో ఎక్స్‌గ్రేషియా పెంపుపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేస్తారని చెప్పారు.ఇదిలావుంటే ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకుని వ్యవసాయం చేయాలని మంత్రి  శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గజ్వేల్‌లో రైతులకు భూసార విశ్లేషణ పత్రాలను రైతులకు మంత్రి పోచారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల రైతులు నష్టాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పారు. పంటకు మద్దతు ధర, పంట నష్టం ఇన్సురెన్స్‌ కేంద్రం పరిధిలో ఉంటదన్నారు. కాంగ్రెస్‌ నేతలు గల్లీలో కాకుండా ఢిల్లీలో పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.