కల్వకుర్తి ‘కల’ సాకారం

c

– ఎత్తిపోతలకు మంత్రి ప్రారంభం

– మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

– మంత్రి హరీశ్‌

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): పాలమూరు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల కల సాకారమయ్యింది. మహాత్మా గాంధీ కల్వకుర్తి-2,3 లిఫ్టుల ఎత్తిపోతల పథకాన్ని జలవనరుల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. జొన్నలబొగుడ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు లిఫ్టులను మంత్రి ప్రారంభించారు. పాలమూరు జిల్లా కోడేరు సవిూపంలో కల్వకుర్తి రెండో ఎత్తిపోతల పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు సాగునీరు అందించే క్రమంలో భాగంగా మంత్రి కోడేరు సవిూపంలోని రెండో లిఫ్టు మోటార్లను ప్రారంభించారు. జొన్నబొగడ జలాశయం నుంచి కాల్వకు నీరును విడుదల చేశారు. రెండో లిఫ్ట్‌ మోటార్‌ను ప్రారంభించిన మంత్రి… జొన్నలబొగడ జలాశయం నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రతి ఎకరాకునీరందించడం, తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమన్నారు. వెనకబడ్డ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చిన హావిూ మేరకునీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు పాలమూరును విస్మరించగా, కెసిఆర్‌ అక్కున చేర్చుకుని వాటిని పూర్తి చేస్తున్నారని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంబించడంతో చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రభుత్వమని మంత్రి జూపల్లి అన్నారు.  లిఫ్టు ఇరిగేషన్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో జిల్లాలోని ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలుగానీ, మంత్రులు గానీ చాలా మాట్లాడారు. కానీ చేసింది శూన్యమని విమర్శించారు. హరీష్‌రావు చొరవ వల్ల ఇవాళ ఎన్నో పనులు జరిగాయని తెలిపారు.  మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో జొన్నలబొగుడ దగ్గర రెండో లిఫ్టు ఉండటంతో ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రారంభోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. మంత్రుల పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పెద్దకొత్తపల్లి మండలం విూదుగా జొన్నలబొగుడకు చేరుకొని, రెండో లిఫ్టు మోటారు, జొన్నలబొగుడ జలాశయం నుంచి మూడోలిఫ్టుకు నీటిని విడుదల చేసి తూములను ప్రారంభించారు. జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్‌ టీకే శ్రీదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.