కళ్లకు గంతలు కట్టుకొని కార్మికుల నిరసన

టేకులపల్లి,అక్టోబర్ 7( జనం సాక్షి ): మధ్యాహ్న భోజన కార్మికులు 10వ రోజు సమ్మె లో భాగంగా శనివారం కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 10 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వుంటున్నదని, దానికి నిరసనగా సమ్మె శిబిరంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా జరిగిన సభలో శకుంతల పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తూ వండి వార్చే కార్మికులకు మాత్రం నెలకు వెయ్యి రూపాయలు వేతనంతో పనిచేయమనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.ఈ కార్యక్రమం లో సీఐటీయూ మండల ,మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ సీఐటీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు నాగలక్ష్మి, ఈసం రాణి, లక్ష్మీ, నర్సమ్మ,సోనాలి, సునిత, లక్ష్మీ, దేవి, మల్లేశ్వరి, లక్ష్మి,చంద్రకళ, అరుణ కుమారి, రామక్క,చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.