కవాతు కోసం కదం తొక్కిన కరీంనగర్
కరీంనగర్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి): సెప్టెంబర్‌లో కరీంనగర్ కవాతును విజయవంతం చేసేందుకు కరీంనగర్ జనం కదం తొక్కారు. మానేరు వంతెన దగ్గర నుంచి ప్రారంభం అయిన కవాతు జిల్లా నలు మూలలనుండి జనం వేలాదిగా కరీంనగర్‌కు తరలివచ్చారు. జై తెలంగాణ నినాదాలతో కరీంనగర్ మార్మోగింది. అత్యంత క్రమశిక్షణతో బారులు తీరి తెలంగాణ వాదులు నాలుగు కిలోమీటర్ల కవాతు నిర్వహించారు.ఈ ర్యాలీలో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, స్థానిక బీజేపీ నాయకులు, సింగరేణి బొగ్గు గని కార్మికులు, జనంసాక్షి సిబ్బంది, జర్నలిస్టులు, టీఎన్‌జీఓలు పాల్గొనగా టీఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు పాల్గొనకపోవడం గమనార్హం. అనంతరం తెలంగాణ చౌక్‌లోను, సర్కస్ గ్రౌండ్‌లోను ర్యాలీని కొనసాగించారు. ఈ ర్యాలికి అగ్ర భాగంగా కోదండరాం, టీఎన్‌జీఓ దేవి ప్రసాద్, ఉద్యోగ సంఘ నాయకులు విఠల్, శంకర్ గౌడ్, జూలూరి శ్రీనివాస్, పల్లెపల్లె లక్ష్మయ్య, అల్లెం నారాయణ తదితరులు పాల్గొన్నారు.