కవితను మళ్లీ గెలిపిస్తే .. 

తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా
– కేటీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సవాల్‌
– కేసీఆర్‌కు ఫాంహౌజ్‌ తప్ప పాలన పట్టడం లేద
– కవిూషన్లు దండుకోవటమే పనిగా కేసీఆర్‌ కుటుంబం పెట్టుకుంది
– వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం
– విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నిజామాబాద్‌, జులై6(ఆర్‌ఎన్‌ఎ): నిజామాబాద్‌ ఎంపీగా కవితను మళ్లీ గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్‌ విసిరారు. గురువారం నిజామాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాలు చేస్తున్నారని, ఆమె చెల్లెను గెలిపించుకుంటే తాను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల వల్ల విద్యావ్యవస్థ గాడితప్పుతోందన్నారు. ఎంసెట్‌ కుంభకోణంలో ఆ సంస్థల డీన్‌ను అరెస్టు చేశారని, అందువల్ల ఆ సంస్థల అనుమతి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా సంస్థల్లో కేసీఆర్‌ కుటుంబానికి 40శాతం వాటా ఉందన్న వార్తలపై సమాధానం చెప్పి.. ఎవరి వాటా ఎంతో తేల్చాలన్నారు. కవిూషన్లు వచ్చే పనులు తప్ప కేసీఆర్‌ ప్రభుత్వం వేరే పనులేవీ చేయడం లేదని
ఆరోపించారు. రూ.30వేల కోట్లకో పూర్తయ్యే ప్రాణహితను రూ.90 వేల కోట్లకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఫామ్‌హౌజ్‌ తప్ప పాలన పట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో కేసీఆర్‌ కొత్త పథకాలకు తెరలేపి ప్రజలను ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న నాలుగేళ్లు ఇచ్చిన హావిూలు అమలు చేయని కేసీఆర్‌ ఎన్నికల సమయంలో రైతుబంధు, రైతు బీమా అంటూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. రైతుబంధు చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేవిూ లేదని, కేవలం పెద్ద రైతులకుమాత్రమే కేసీఆర్‌ పథకాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. పేదల అభ్యున్నతి పట్టని తెలంగాణ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.