కవితపై ఈడీ ఛార్జిషీటు

` తీర్పువాయిదా
న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మంగళవారం విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన ఏడవ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. 8 వేల పేజీలతో కూడిన ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత సహా 5 మంది నిందితులపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై వాదనల అనంతరం తుది ఉత్తర్వులను కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరించనున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఢల్లీి సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌కు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌పై ఈ నెల 28న వాదనలు మొదలుకానున్నాయి.