*కవులను కళాకారులను ఘనంగా సత్కరించిన వేమూరి*
మునగాల, సెప్టెంబర్ 18(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత సమైక్యత వజ్రోత్సవాలు సందర్భంగా గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు సత్యనారాయణ ఆధ్వర్యంలో కవులను కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ పట్టణానికి చెందిన ఎస్వీ విద్యాసంస్థల అధినేత ముత్తినేని సైదేశ్వరరావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సైదేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నరసింహాపురం గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం కలిగి ఉండి గతంలో కవులకు కళాకారులకు నిలయమై ఉండి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామం వెనుకబడిన తరుణంలో పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న గ్రామానికి చెందిన ఇప్పుడు ఇది గ్రామానికి చెందిన శ్రీ కోదండరామ స్వామి సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ ఈ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మారుమూల గ్రామాలలో ఉన్న ప్రముఖ రంగస్థలం కళాకారులను కవులను జానపద కళాకారులను గుర్తించి వారిని సత్కరించటం ఎంతో అభినందనీయం అన్నారు. అంతేగాక మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారులు, నటులు డాక్టర్ గుంటి పిచ్చయ్య, మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రముఖ కవయిత్రి సోమయాజుల భవాని, సూర్యపేట పట్టణవాసి ప్రముఖ కవి పోతుగంటి వీరాచారి, ఆకుపాముల గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారులు రాజుల వీరబాబుని ఘనంగా శాలువా పూలమాలతో సత్కరించి మెమొంటో అందజేశారు. తదుపరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లలో భాగంగా నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆకుపాముల గ్రామానికి చెందిన ప్రస్తుతం హైదరాబాద్ లో ఆసీఫ్ నగర్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న చెర్వుపల్లి శ్రీనివాస్ సహకారంతో అందచేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మ చిన్న వెంకన్న, కారంగుల వెంకట సైదులు, శంకర్, కన్నెబోయిన విజయ్, పానుగుల లింగయ్య, బారి సతీష్, ముత్తు చంద్రయ్య, సాయి నరేష్ చందు, శ్రీను, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.