కష్ట సుఖా లను సమానంగా స్వీకరిస్తూ సమాజంలో ఉన్నతమైన జీవితాన్ని గడపాలి వింటేజ్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి
మోమిన్ పేట ఆగస్టు 20 (జనం సాక్షి)
కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ సమాజంలో ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని వింటేజ్ సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అన్నారు శనివారము వింటేజ్ స్కూల్లో జరుగుతున్న కృష్ణాష్టమి నీ పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు .గోపిక గోపాలురు కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆకట్టుకుని పలువురిని ఆకర్షించాయి అనంతరం ఆయన మాట్లాడుతూ అంతట ఉన్నది నేనే నీలోని నాలోని ఉన్నది నేనే అని చెప్పినవాడు శ్రీ కృష్ణ పరమాత్మ అని అన్నారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన సారమే భగవద్గీత అన్నారు అందుకుగాను నేటి సమాజంలో భగవద్గీతను ప్రతి ఒక్కరు పారాయణ గ్రంథంలో ఆచరించి తరించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనిత మల్లికార్జున్ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు