కాంగ్రెస్‌కు నాయకత్వమే సమస్య
హైదరాబాద్,జనవరి9 జనంసాక్షి : నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్ తెలుగు రాష్టాల్ల్రో దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో వాటిని ఎదుర్కొనే వ్యూహంలో విఫలం అవుతున్నాయి. పిసిస చీఫ్‌గా తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మరోమారు పొడించారు. ఈ పదవిపై ఆశపెట్టుకున్న కోమటిరెడ్డి డీలా పడ్డారు. ఆయన గట్టిగానే ప్రయత్నించినా లాభం లేకుండా ఆపోయింది. ఇరురాష్టాల్ల్రో కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎపిలో చంద్రబాబు ఏదో చేశారని, తెలంగాణలో కెసిఆర్ మరేదో చేశారని చెబుతూ ప్రజల్లోకి వెల్లేందుకు నానాయాతన పడుతున్నారు. అన్నింటికి మించి తెలంగాణలో అనేక విధాలుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎపిలో తాజాగా పోలవరంపై నేతలు పాయాత్రలు చేపట్టారు. అయితే రెండు రాష్టాల్ల్రోనూ సమర్థులైన నేలు లేకపోవడం, ఛరిష్మా లేకపోవడంతో కాంగ్రెస్ నెగ్గుకు రాలేకపోతోంది. తాజాగా రాహుల్‌ను రప్పించడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు. మేడారం జాతరకు రప్పించి గిరిజనుల సానుభూతి పొందేలా చూడాలని చూస్తున్నారు. నిజానికి ఎపిలో రఘువీరాకు పెద్దగా అసమ్మతి లేకపోవచ్చేమో కానీ తెలంగాణలో ఉత్తమ్ నాయకత్వంపై మాత్రం సమస్యలు ఉన్నాయి. దీనిని అధిగమించేందుకు ఆయన రాహుల్ సభపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇకపోతే రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్టాల్ల్రో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ వీధుల్లో పడుతూలేస్తూ గత వైభవం కోసం పాకులాడుతోంది. మరో ఏడాదిన్నరేళ్లలో ఎన్నికలు రానుండడంతో ఇప్పటి నుంచే కార్యక్రమాలతో ముందకు సాగుతున్నారు. విషయం ఏదైనా యాగీ చేయడమే ప్రధానం అన్న రీతిలో కార్యక్రమాలు చేస్తోంది. ఉభయ తెలుగురాష్టాల్ల్రో ఇప్పుడదే పరిస్థితిని కొనసాగి స్తోంది. ఎపిలో ప్రత్యేక¬దా,
తెలంగాణలో ప్రాజెక్టులపై పోరు ప్రధానాంశాలుగా పోరు సాగించి చతికిల పడ్డారు. విభజనతో ఎపిలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ మెల్లగా ముందుకు సాగుతోంది. వైకాపా నిరంతరంగా పోరాడుతున్నా కాంగ్రెస్ అంతకుమించి కార్యక్రమాలను చేస్తూనే ఉంది. విభజన అపవాదు నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన ఏపి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. విభజన పాపం కన్నా ప్రత్యేక¬దాను ఆధారం చేసుకుని పోరాటాలు చేసినా ఫలించడం లేదు. ఇకపోతే తెలంగాణలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ టిఆర్‌ఎస్‌ను విమర్శలు చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు. అందుకే ప్రధానంగా రైతుల సమస్యలను భుజానకెత్తుకున్నారు. దీనికి తోడు రాహుల్ సభ ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్ప్పుడు నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. నాయకత్వం మారితే తప్ప ఫలితం ఉండదని చెబుతున్నారు. జరిగిన తప్పిదాలేమిటి? లోటుపాట్లేమిటన్న అంశాలను చర్చించడం కూడా అవసరం. రాహుల్ నాయకత్వం తరవాత తెలుగు రాష్టాల్ల్రో అనుసరించే వ్యూహం ఏమిటో ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ గత పాపాలను విస్మరించి మాట్లాడితే ప్రజలు నమ్మరని గ్రహించడం లేదు. అందుకే గతాన్ని మరుగునపరచాలనుకున్నవారికి కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. ఈ దశలోనైనా సమూల ప్రక్షాళనకు సంసిద్ధం కాకపోతే పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు గ్రహించడం ఉత్తమం.