కాంగ్రెస్‌ను ఇరుకును పెట్టే వ్యూహం

నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు నేడు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సభ్యులకు కేంద్రం విప్ జారీ చేసింది. అగస్టా కుంభకోణంపై కాంగ్రెస్‌ను ఇరుకును పెట్టే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నోట్లరద్దు రగడతో ఈ శీతాకాల సమావేశాలు bjp-logo-photosకొట్టుకుపోతున్నాయి. సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఇదే తంతు. ఇక మూడు రోజులే మిగిలి ఉన్నాయి. చివరి మూడు రోజులైన సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అధికార పక్షం కోరుతోంది. అయితే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజుపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విపక్షాలకు ఆ అంశం హాట్ టాపిక్‌గా మారనుంది. నోట్లరద్దుతో పాటు, రిజిజు వ్యవహారాన్ని విపక్షాలు సభలో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.