కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం

cong-1నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వైనం
న్యూఢిల్లీ,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పదేళ్ల అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇందులో నాయకత్వ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. ఓ వైపు అనేక రాష్టాల్ల్రో ఎన్నికలకు వెళుతున్న సమయంలో సీట్ల కోసం దేబరించుకునే దుస్థితిలో పార్టీ ఉంది. ధైర్యంగా ఏ రాష్ట్రంలోనూ ఒంటరిగా పోటీ చేసే స్థితి లేదు. అలాగే ఉన్న రాష్టాల్రను కూడా కాపాడుకోలేని దుస్థితి ఉంది. దీనికి రాహుల్‌ నాయకత్వ సమస్య కూడా కారణం కావచ్చు. శ్రేణులను ఆయన వ్యూహాత్మకంగా నడిపించలేకపోతున్నారన్న అపవాదు ఉంది. తమిళనాడులో డిఎంకె విసరిన ఎంగిలి మెతుకులు అన్న చందంగా సీట్ల పొత్తు సాగింది. బెంగాల్లో అయితే అడ్రస్‌ లేని దుస్థితి. కేరళలో ఉన్న అధికారం ఉంటుందా లేదా అన్న భయం. ఇప్పటికే అధికారంలో ఉన్న రెండు రాష్టాల్రు చేజారాయి.

ఉత్తరాఖండ్‌లో తొమ్మిది మంది పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌  పై తిరుగుబాటు చేయడంతో పార్టీ ప్రభుత్వం పడిపోవటం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవర పరచింది. దాంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆమె హడావుడిగా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి మార్పు ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలించారు. తిరుగుబాటు చేసిన వారిని సంతృప్తి  పర్చటం కోసం ఆర్ధిక మంత్రి ఇందిరా హ్రిదయాష్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని అనుకొన్నారని తెలుస్తోంది. కాని పక్షంలో 2014లో ముఖ్యమంత్రి పదవికి జరిగిన పోటీలో రావత్‌తో పోటీ పడిన మంత్రి ప్రీతం సింగ్‌ పేరును కూడా పరిశీలించారు. తనను పార్టీయే గద్దె దింపడం పట్ల రావత్‌  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకై తాను ముఖ్యమంత్రి పదవి నుండి దిగడానికి నిరాకరించారు. తనను దింపే

ప్రయత్నం ఢిల్లీ నుండి చేస్తే అత్యధిక  శాసనసభ్యులతో కలసి పార్టీ నుండి వెళ్ళిపోయి కొత్త పర్వత ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. దానితో కాంగ్రెస్‌ అధిష్టానవర్గం దిమ్మెరపోయి మౌనం దాల్చ వలసి వచ్చింది. చివరకు రాష్ట్రపతి పాలన అనివార్యమయ్యింది. కేంద్రంలో కనీసం ప్రతిపక్ష స్థానం కుడా పొందలేని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఒకొక్క రాష్టాన్న్రి కూడా కోల్పోయే ప్రమాదం కనిపిస్తున్నది. ఎన్నికలు జరుగనున్న రాష్టాల్రలో ప్రతికూల పరిస్థితులను  ఎదుర్కొంటున్నది. సొంత పార్టీ

ఎమ్మెల్యేలే తిరుగుబాటు  చేయడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి రాజకోవా ఆధిక్యత కోల్పోయి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించ వలసి వచ్చింది. సగం మంది పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుండి వైదొలిగారు.  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కేరళలో స్వయంగా ముఖ్యమంత్రి సోలార్‌ స్కామ్‌లో చిక్కుకోవడం, ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయమని క్రింది కోర్ట్‌ ఆదేశాలు జారీ చేయడం, అవినీతి ఆరోపణలపై ఇద్దరు మంత్రులు రాజీనామా చేయవలసి రావడం తో పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నది. హై కోర్టు తీర్పుతో తాత్కాలికంగా ఉరట లభించినా కొడుకుపై తాజాగా ఆరోపణలు రావడం ముఖ్యమంత్రి  ఉమెన్‌ చాందీకి ఎన్నికలలో పార్టీని విజయం వైపు నడిపించడం అనుమానాస్పదంగా మారింది. తమిళనాడులో పార్టీ అస్తిత్వ సమస్య ఎదుర్కొంటున్నది. డి యం కె తో పొత్తు మినహా గత్యంతరం లేకుండా పోయింది.

ఈ లోగా జి కె వాసన్‌ పార్టీ నుండి వేళ్లిపోవడంతో పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని వెల్లడిస్తున్నది. అస్సాంలో ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో తిరుగుబాటు తో పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి. పొత్తుల కోసం ఆరాట పడుతున్నది. మరో వైపు  పంజాబ్‌లో గురు గ్రంథ సాహిబ్‌ అంశం పార్టీలో సంక్షోభం సృష్టిస్తున్నది.. బీహార్‌ ప్రభుత్వ సలహాదారుడు ప్రశాంత్‌ కిషోర్‌ ను ఎన్నికల వ్యూహం కోసం మాజీ ముఖ్యమంత్రి అమరిందర్‌

సింగ్‌ సొంతగా నీయమించు కోవడం పార్టీలో కలతలు రేపుతున్నది. ఉత్తర ప్రదేశ్‌ లో పార్టీ ప్రచార బాధ్యతలను ప్రియాంక గాంధీ కి అప్పచెప్పాలని పార్టీ వర్గాల నుండి ఒత్తిడి ఎదురవుతున్నది. ఈ విధంగా చేస్తే రాహుల్‌ గాంధీ నాయకత్వాన్నినీరుగార్చినట్లు కాగలదని సీనియర్‌ నాయకులు కలత చెందుతున్నారు.

అయితే ప్రియాంకను తసీఉకుని వస్తే పార్టీకి ఉత్తేజం వస్తుందని వాదిస్తున్న వారు ఉన్నారు. వారి మాటను సోనియా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మొత్తంగా రాహుల్‌ రాజకీయంగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయినా కాంగ్రెస్‌కు పటిష్ట నాయకుడిగా ఎదగలేక పోతున్నారు.