కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం
మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకిచెరుకు
చెరుకు రాకపై తీవ్రంగా మండిపడ్డ వెంకట్ రెడ్డి
రేవంత్ మొఖం చూసేది లేదని భీషణ ప్రతిజ్ఞ
న్యూఢల్లీి,ఆగస్ట్5(జనంసాక్షి): తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చెరుకు సుధాకర్ చేరికను ఎంపికోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే తమ్ముడితో కలిపి తనపై రేవంత్ విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చెరుకు సుధాకర్ చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పెద్దతప్పు చేశారని విమర్శించారు. తనను ఓడిరచాలనుకున్న వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం చూడనని అన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. విూడియా ప్రశ్నలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అలాగే వెంకట్‌రెడ్డి తీరుపై కూడా విూడియా ప్రతినిధులు మండిపడ్డారు. పనికిరాని మునుగోడు గురించి అడుగుతున్నారని బాధగా ఉందని వెంకట్‌రెడ్డి అన్నారు. వరద సాయం గురించి ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్ కూడా కోరానన్నారు. గుజరాత్ తర్వాత.. తెలంగాణాయే ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రం ఇలా ఉన్నప్పుడు.. సీఎం కేసీఆర్ వరద బాధితులకు ఇంకేం సాయం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.