కాంగ్రెస్‌లో పిసిసిపై చర్చ
తనకు పదవి కావాలన్న జగ్గారెడ్డి
హైదరాబాద్,నవంబర్19 (జనంసాక్షి) : ఇప్పుడంతా కాంగ్రెస్‌లో పిసిసి పీఠంపైనే ర్చ సాగుతోంది. నలుగురు నేతలు కలిస్తే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జగ్గారెడ్డి అయితే తనకు పిసిసి పదవి కావాలని బాహాటంగానే ప్రకటించారు. మరోవైపు ఇదే అంశంపై సీఎల్పీలో భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, విశ్వేశ్వర్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌నే కొనసాగించాలని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్పు ఉంటే తనకు మద్దతు ఇవ్వాలని భట్టి విక్రమార్కను జగ్గారెడ్డి కోరారు. అయితే జగ్గారెడ్డి ఆసక్తిపై స్పందించిన మిగతా నేతలు.. సిరియస్‌గా ప్రయత్నం చేస్తున్నావా అని జగ్గారెడ్డిని ప్రశ్నించారు. రెడ్డి సామాజికవర్గానికి అవకాశం వస్తే పోటీలో ఉన్నవాళ్లంతా సమర్థులేనని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్పు అనివార్యమైతే సైలెంట్‌గా పని చేసుకుపోయే శ్రీధర్ బాబుకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానానికి చెబుదామని నేతలతో జగ్గారెడ్డి అన్నారు.