కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే

` ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళితనేత
` శశిథరూర్‌పై భారీమెజార్టీతో గెలుపు
` శుభాకాంక్షలు తెలిపిన రాహుల్‌, థరూర్‌.. నేరుగా ఇంటికి వెళ్లి అభినందించిన సోనియా
` కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట సంబరాలు
` కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడిగా ఖర్గేకు అవకాశం
` 26న అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న సూర్జేవాలా
న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్‌ ఖర్గే ఘనవిజయం సాధించారు. ఆయనకు 7,897 ఓట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. మల్లికార్జున్‌ ఖర్గే విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాన్నాయి. ఏఐసీసీ కార్యాలయం బయట సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్‌ ఖర్గేకు శశిథరూర్‌ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. నిజమైన పార్టీ పునరుద్ధరణ పక్రియ ఈరోజుతో మొదలైనట్టు నేను నమ్ముతున్నాను అని శశిథరూర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితర ప్రముఖులు అభినందనలు తెలిపారు. నెహ్రూ`గాంధీ కుటుంబ సభ్యులు కానివారు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపడుతుండటం 24 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఈనెల 17వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ అనంతరం ఆయా రాష్టాల్ర నుంచి బ్యాలెట్‌ పెª`టటెలను న్యూఢల్లీిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని శశిథరూర్‌ వర్గం ఆరోపించింది. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లింది. లక్నోలో లేని డెలిగేట్ల ఓట్లు పోలయ్యాయని, యూపీ నుంచి పోలైన అన్ని ఓట్లను చెల్లనివిగా పరిగణించాలని కోరింది. మొత్తంగా  సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎంపీ శశిథరూర్‌పై ఆయన విజయం సాధించారు. ఈనెల 17న ఎన్నికలు జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.137 ఏండ్ల కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ చరిత్రలో అధ్యక్ష పదవికి ఆరుసార్లు మాత్రమే ఎన్నిక జరగడం విశేషం. ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నేతలు శశి థరూర్‌, మల్లిఖార్జున ఖర్గే పోటీపడ్డారు. అయితే, ఈ ఎన్నికల్లో ఖర్గే విజయం సాధించి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు.
నేరుగా ఇంటికి ఖర్గేను అభినందించిన సోనియా
కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఫలితాలు వెలువడిన అనంతరం రాజాజీ మార్గ్‌ లోని ఖర్గే ఇంటికి వెళ్లిన సోనియా ఆయనకు అభినందనలు చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఖర్గే  సోనియా నివాసానికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకుంటారని అంతా భావించారు. ఇందుకోసం ఆయన సోనియాను అపాయింట్‌ మెంట్‌ కూడా కోరారని వార్తలొచ్చాయి. అయితే  ఎవరూ ఊహించని విధంగా స్వయంగా సోనియానే ఖర్గే నివాసానికి వెళ్లి కొత్త అధ్యక్షుడికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. గాంధీ కుటుంబం నుంచి ఓ వ్యక్తి పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లడం చాలా అరుదు. 2015లో బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ను  సోనియా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా కూతురు ప్రియాంక గాంధీతో కలిసి సోనియా పార్టీ నూతన అధ్యక్షుడు ఖర్గే ఇంటికి వెళ్లారు. ఇదిలావుంటే పేద కుటుంబంలో పుట్టిన తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న కాంగ్రెస్‌ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో.. పారదర్శక ఎన్నిక ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. ఢల్లీిలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే విూడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక పక్రియలో  పాల్గొన్న పార్టీ నాయకులతో పాటు అధ్యక్ష స్థానానికి పోటీచేసిన శశిథరూర్‌ కు అభినందనలు తెలిపారు. తామంతా కలిసికట్టుగా నిరంకుశ కేంద్ర ప్రభుత్వంపై, ఫాసిస్టు శక్తులపై ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రక్తం, చెమటతో కాంగ్రెస్‌ పార్టీని సోనియాగాంధీ దేశవ్యాప్తంగా బలోపేతం చేశారు. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న హయాం మాకు స్ఫూర్తిదాయకం.రాహుల్‌ గాంధీతో కలిసి మేమంతా నడుస్తం. ఆయన నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేస్తం. పాదయాత్రలో ఉన్నప్పటికీ నాకు ఫోన్‌ చేసి రాహుల్‌ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ లో ప్రతి ఒక్కరు కార్యకర్తల్లా ముందుకు సాగాలి. కలిసికట్టుగా ఫాసిస్టు శక్తులపై పోరాడాలని ఖర్గే పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఖర్గే ఈనెల 26న బాధ్యతలను స్వీకరిస్తారని కాంగ్రెస్‌ ఎంపీ రణ్‌ దీప్‌ సుర్జేవాలా ప్రకటించారు. ఆ రోజున ఆయన విూడియాతో మాట్లాడుతారని వెల్లడిరచారు.
కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు
దేశంలోనే అతి పురాతనమైన కాంగ్రెస్‌ పార్టీకి 24 ఏండ్ల తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో శశిథరూర్‌పై మల్లికార్జున్‌ ఖర్గే దాదాపు 7000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు లభించగా.. థరూర్‌కు కేవలం 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఖర్గే ఇప్పుడు తన పాత్రను నిర్ణయిస్తారని ఆంధ్రప్రదేశ్‌లో విూడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చెప్పారు. కాగా, ఏఐసీసీ కొత్త అధ్యక్షుడికి శశి థరూర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడయిన రెండో దళిత నాయకుడిగా ఖర్గే నిలిచారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడైన తొలి దళిత నాయకుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌. స్వాతంత్యాన్రంతరం పార్టీ నాయకత్వం 75 ఏండ్లలో 42 ఏండ్ల పాటు గాంధీ కుటుంబంతోనే కొనసాగగా.. 33 ఏండ్ల పాటు పార్టీ అధ్యక్ష పగ్గాలు గాంధీయేతర నేతల వద్ద ఉన్నాయి.
కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి 1998లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్‌ తలపడ్డారు. ఆ ఎన్నికల్లో సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా, జితేంద్ర ప్రసాద్‌కు కేవలం 94 ఓట్లు తగ్గాయి. 1998 నుంచి 2017 వరకు, తిరిగి 2019 నుంచి 2022 వరకు 20 ఏండ్లకు పైగా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో ఉన్న సోనియా గాంధీ.. పార్టీకి ఎక్కువ కాలం పనిచేసిన అధ్యక్షురాలుగా రికార్డుల్లో నిలిచారు. 2017 నుంచి 2019 వరకు రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఈ పదవిని చేపట్టేందుకు నిరాకరించడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని శశి థరూర్‌ ప్రధాన ఎన్నికల ప్రచారకుడు సల్మాన్‌ సోజ్‌ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, తెలంగాణలో పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ సమయంలో అవకతవకలు జరిగాయని సోజ్‌ చెప్పారు. అవకతవకలు జరిగిన విషయాన్ని పార్టీ ఎన్నికల ఇంఛార్జ్‌ మధుసూదన్‌ మిస్త్రీకి తెలియజేసినా ఫలితం లేకపోయిందని సోజ్‌ విచారం వ్యక్తం చేశారు.