కాంగ్రెస్ టిక్కట్ల కోసం మహిళల్లోనూ పోటీ
ఆదిలాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. తమకు 33శాతం టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదనను మహిళలు తెరవిూదకు తీసుకరావడంతో జిల్లాలో ఇద్దరుముగ్గురు మహిళలకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండు వ్యక్తమవుతోంది. టికెట్ల పోటీలేని నిర్మల్, ఆసిఫాబాద్ నియోజవర్గాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులనే ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్, మంచిర్యాల, చెన్నూరు, కాగజ్నగర్లలో నెలకొన్న పోటీని తట్టుకునేందుకు బీసీ, మహిళా కోటాను కూడా తెరవిూదకు తెచ్చినట్లు తెలిసింది. తెరాస అభ్యర్థులను తట్టుకునేందుకు ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మహాకూటమితో పొత్తులతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను గుర్తించినట్లు తెలిసింది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ స్కీన్రింగ్ కమిటీ తయారు చేసిన జాబితాను దిల్లీకి పంపనున్నట్లు తెలిసింది.