కాంగ్రెస,్ టీడీపీ వైకాపాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించటం లేదు:కోదండరాం
హైదరాబాద్ డిసెంబర్ 1, (జనంసాక్షి)
కాంగ్రెస,్ టీడీపీ వైకాపాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించటం లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. శనివారం కోదండరాం అధ్యక్షతన తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సమావేశనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస,్ టీడీపీ వైకాపాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించటం లేదని ఆయన విమర్శించారు. బెడ్జెట్ సమావేశాల సమయంలో అసెంబ్లీని ముట్టడించాలని కోదండరాం పిలుపు నిచ్చారు. శాసనసభలో తెలంగాణపై తీర్మాణం చేయించే బాధ్యత తెలంగాణ ప్రజాప్రతినిధులదేనని తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెలంగాణపై చిత్తశుద్ది ఉంటే శాసనసభ శీతాకాల శాసనసభ సమావేశాలల్లో తెలంగాణ తీర్మానం చేయించి చిత్తశుద్ది నిరుపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్9న కొవ్వత్తులతో ప్రదర్శణలు నిర్వాహిస్తామని తెలిపారు. డిసెంబర్ 23న విద్రోహ దినంగా .పాటిస్తూ వాడవాడలో తెలంగాణ పది జిల్లాలల్లో నల్లజెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన అన్నారు.