కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణాను చీకటిమయం
24 గంటల కరెంట్ కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్,నవంబర్27(జనంసాక్షి): నిర్మల్ లో కారు జోరు కొనసాగుతున్నది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఊరూరా తిరుగతుఊ ప్రచ,ఆరం సాగిస్తున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నది. నియోజకవర్గంలో అందరికంటే ముందుగానే బరిలోకి దిగి, నిత్యం సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఉదయం 8 గంటల కల్లా ప్రచారాన్ని మొదలుపుడుతూ… రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతూ.. పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపుతున్నారు. అలుపెరుగని పర్యటనలతో అల్లోల ¬రెత్తిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణాను చీకటిమయం చేస్తారని, 24 గంటల కరెంట్ కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను సీఎం చేయాలని నిర్మల్ టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసుకునే వీలుంటుందని, అందుకు అందరూ సహకరించాలన్నారు. గతంలో అధికారంలో ఉన్న ఏపార్టీలు కూడా సామాన్య ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి అభివృ ద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. టీఆర్ఎస్తోనే నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు ఆసరా లభిస్తుందని, గత నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని వివరించారు. టీఆర్ఎస్ పార్టీని మళ్లీ ఆశీర్వదిస్తే ఆసరా పింఛన్లు రూ.2016కు పెంచుతామన్నారు, వికలాంగులకు రూ.3016 ఇస్తామన్నారు. నిరుద్యోగభృతి కింద రూ.3016 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామన్నారు. రైతులకు ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని
చెప్పారు. ఇదే ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గులాబీ శ్రేణుల దూకుడుకు టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే ధీమా సర్వత్రా వ్యక్తమవుతున్నది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతున్నది. రెండు నెలలుగా పక్కా ప్రణాళిక మేరకు ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ సేనలు మరో అడుగు ముందుకేసి నిత్యం జనంతోనే మమేకమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్మణచాంద మండలంలో పలు గ్రామాల్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయా గ్రామాల ప్రజలు జననాయకుడికి నీరాజనం పలికారు. మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని, కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు ముక్తకంఠంతో తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా.మల్లికార్జు రెడ్డి, ఎంపీపీ కౌసల్య గణెళిష్, మండల నాయకులు రఘునందన్ రెడ్డి, అట్ల రాంరెడ్డి, అడ్వల రమేష్, మాజీ జడ్పీటీసీ నారాగౌడ్, ప్రతాప్ రెడ్డి, కృష్ణా రెడ్డి లక్ష్మి నరేష్ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.