కాంగ్రెస్‌ స్టార్‌ కాంపెయినర్‌గా ప్రియాంక?

కాంగ్రెస్‌ వ్యూహాల్లో లోపాయికారిగా పాల్గొంటున్న ప్రియాంక

వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు

ఆమెను తీసుకొస్తేనే పార్టీకి మేలని వాదన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో కోటరీ చురుకుగా పనిచేస్తోంది. రాహుల్‌ను ప్రధాని చేయడం అన్నది పక్కన పెట్టి విపక్షాలను కలుపుకుని ముందు అధికారంలోకి రావడం లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎవరు ప్రధాని అన్నది చూద్దం అన్న ప్రకటన చేశారు. దీంతో విపక్షాలు చెల్లా చెదురు కాకుండా చూస్తున్నారు. మమతా బెనర్జీ కూడా తానే ప్రధాని రేసులో ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రకమైన సర్దుబాటులోకి వచ్చారు. ముందు అధికారంలోకి వస్తే తరవాత సంగతి చూద్దం అన్న రీతిలో కాంగ్రెస్‌ పెద్ద మనసు చేసుకుని సాగుతోంది. ఇక వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చెందిన పాతకాపులను రప్పించే ప్రయత్నం చేస్తుండగా కొత్తగా యూత్‌ను కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల పిసిసిలకు ఈ పని అప్పగించారు. ఇన్న మార్పులు సడన్‌గా తీసుకోవడం వోనక సోనియా తనయ ప్రియాంక ఉందన్న ప్రచారం/- సాగుతోంది. పైకి కనిపించక పోయినా ప్రధాన సమస్యలు, అంశాలపై ఆమె సూచనలు చేసి అమలు చేయిస్తున్నారని వినికిడి. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయల్లోకి రావడంపై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఇంతకు ముందు కూడా తన తల్లి, సోదరుడి తరఫున రాయ్‌బరేలి, అమేథిలలో ప్రచారం చేశారు కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు కొందరు ప్రియాంకను ఇంకా తురుపుముక్కగానే భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలో రాహుల్‌ ఉన్నా, భావి ప్రధాని అభ్యర్థి ఆయనే అయినా ప్రచారం కోసం నామమాత్రంగా కాకుండా ప్రియాంకను చూపి ఓట్లు కొల్లగొట్టాని చూస్తున్నారు. ఓ వర్గం ఇప్పటికీ ప్రియాంక వాద్రా రాజకీయ ప్రవేశానికి ప్రయత్నాఉ చేస్తేనే ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకను తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. ప్రచారంలో ఆమెను దింపితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అనుకూల పవనాలు సాధిస్తుందని అంటున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తాను ఇప్పుడు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచే పోటీ చేస్తారని, అయితే రాయ్‌బరేలి నుంచి సోనియాకు బదులుగా ఆమె కుమార్తె ప్రియాంక పోటీ చేయించాలని ఆ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఆమె కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు కుమారుడు రాహుల్‌ గాంధీకి అప్పగించడం తెలిసిందే. ఇదే కారణంగానే ఆమె ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని, ఆమెకు బదులుగా కుమార్తె ప్రియాంకను పార్టీ బరిలోకి దింపిడతంతో పాటు ప్రచార ర రంగంలో దింపాలని చూస్తున్నారు. మోడీని ఢీకొనాలంటే ఇప్పుడు ప్రియాంక మా/-తరమే అసవరమని భావిస్తున్నారు. చుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పార్టీలో నిర్ణయం తీసుకునేలా పావులు కదుపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, అమేథి స్థానాలు నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమేథినుంచి గాంధీ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాతినిధ్యం వహించారు.సంజయ్‌ మరణానంతరం రాజీవ్‌ గాంధీ అమేథీ నుంచి 1981,1984,1989లలో గెలుపొందారు. 1991లో ఎన్నికల ప్రచార సమయంలో ఆయన దారుణ హత్య తర్వాత కూడా సోనియా ఈ నియోజక వర్గంనుంచి గెలుపొందారు. రాజీవ్‌ తర్వాత

ఆయన సతీమణి సోనియా గాంధీ1999 లోక్‌సభ ఎన్నికల్లో తన రాజకీయ ప్రవేశానికి ఇదే నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె అమేథీని తన కుమారుడు రాహుల్‌ కోసం వదిలిపెట్టి రాయ్‌బరేలి నుంచి 2004నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక ఒకప్పుడు దివంగత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌ గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలి నియోజక వర్గం సైతం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటే.1957నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మూడు సందర్భాల్లో మినహా అన్ని సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్రలో శివసేన పార్టీతో పొత్తు పెట్టుకోబోదని కూడా ఆ వర్గాలు తెలిపాయి. సైద్దాంతికపరమైన విభేదాలే దీనికి కారణమని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించరాదని కూడా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దశలో స్టార్‌ కాంపెయినర్‌గా ప్రియాంకను దింపితే మోడీని ఢీకొనవచ్చిన భావిస్తున్నారు. ఈ దశలో వీరి ని ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది చూడాలి