కాంగ్రెస్‌ గెలిస్తే అంధకారమే..

` మళ్లీ వాళ్లు అధికారంలోకొస్తే జనరేటర్లు, ఇన్వర్టలే గతి..
` ఆ పార్టీ 11 సార్లు అధికారంలో ఉన్నా సాగు,తాగు నీరు ఇవ్వలేదు
` బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి రవిశంకర్‌నే మళ్ళీ గెలిపించండి
` కాంగ్రెస్‌,బిజెపిల డ్రామాలను నమ్మొద్దు
` అన్ని వర్గాలకు అండగా నిలిచింది కెసిఆరే
` చొప్పదండి,నర్సాపూర్‌  రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌
చొప్పదండి,మెదక్‌: నవంబర్‌ 26 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తప్పిదారి కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్‌ మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు దక్కుతుందని అన్నారు రాష్ట్రంలో 11 సార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిపాలించిందని 55 ఏళ్లలో సాగు తాగునీటి సమస్య పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. వారి హయాంలో రైతులకు నాణ్యమైన కరెంటు లేక మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉండేదని రాత్రిపూట కరెంటు పెట్టేందుకు వెళ్లి చాలామంది రైతులు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు ఊళ్ళల్లో ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్లి స్నానం చేసేందుకు కరెంటు ఇవ్వాలని కరెంటు అధికారులను బతిమిలాడామని గుర్తు చేశారు. వీటన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రజలకు 24 గంటలు నాణ్యమైన కరెంటును ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. నాటి కాలంలో కరెంటు ఉంటే వార్త ఉండేదని నేటి కాలంలో కరెంటు పోతే వార్త అవుతుందని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు .రైతులపై వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేకుండా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి 10 హెచ్పి మోటార్లు పెట్టి మూడు గంటల కరెంటు ఇస్తే రైతులకు సరిపోతుందని అంటున్నాడని ఎన్నికల ప్రచారానికి వచ్చిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి 5 గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని పేర్కొంటున్నారని వారి మనసులోని మాటను ప్రజలకు ఇప్పుడే చెబుతున్నారని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు .ఈ ఎన్నికల్లో కరెంటు కావాలని కాంగ్రెస్‌ కావల్నో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. కరెంటు ఎక్కడ ఉందని రేవంత్‌ రెడ్డి వాక్యాలు చేస్తున్నాడని వారికోసం ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేస్తామని వారు ఎక్కడికైనా వెళ్లి కరెంటు తీగలు పట్టుకొని కరెంటు లేదని నిరూపించాలని సవాల్‌ విసిరారు.  వారి పాలనలో కరెంటు లేకుండా ఇండ్లలో షాపులలో ఇన్వర్టర్లు జనరేటర్‌ లను ఏర్పాటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇన్వెర్టర్లు జనరేటర్‌ దుకాణాలు మూతపడ్డాయని పేర్కొన్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళల్లో సర్పంచులు ఎంపీటీసీలువారిని ప్రజలు మంచినీటి కోసం నిలదీస్తారని భయపడే వారిని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటింటికి నీరు అందిస్తూ ఎండాకాలంలో సైతం ఎలాంటి సమస్య లేకుండా చేసుకున్నామని తెలిపారు. దేశానికే దిక్సూచిగా రైతన్నకు పెట్టుబడిగా రైతుబంధును ప్రవేశపెట్టి రైతును రాజు చేసిన ఘనత కేసిఆర్‌ కి దక్కుతుందని రానున్న రోజుల్లో రైతుబంధును ఎకరాకు 16000 పెంచుతామని పేర్కొన్నారు .రైతు భీమా మాదిరిగా రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కెసిఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకంతో ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేస్తామని పేర్కొన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకంతో 18 ఏళ్ళు నిన్న ప్రతి యువతీకి 3000 రూపాయలు అందజేస్తామని అన్నారు. మోడీ హయాంలో 1200 ఉన్న సిలిండర్ను 800 రాష్ట్ర ప్రభుత్వం భరించి 400కే అందజేస్తామని చెప్పారు. వృద్ధులు వితంతువులకు అందజేస్తున్న రెండు వేల పెన్షన్ను రానున్న రోజుల్లో 5000 కు పెంచుతామని హావిూ ఇచ్చారు. నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుంక రవిశంకర్‌ ను భారీ మెజార్టీతో గెలిపించి మరో మారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ను చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ మాట్లాడుతూ నియోజవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తనను మరోసారి ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి,  ఎంపీపీ చిలుక రవీందర్‌, జెడ్పిటిసి మాచర్ల సౌజన్య `వినయ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం చుక్కారెడ్డి ,వైస్‌ చైర్మన్‌ చీకట్ల రాజశేఖర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, పెద్ది శంకర్‌, గుంట రవి ,విద్యాసాగర్‌ రెడ్డి ,మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణ హరి ,మాజీ జడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య ,బి ఆర్‌ ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌,బిజెపిల డ్రామాలను నమ్మొద్దు
మెదక్‌:కాంగ్రెస్‌,బీజేపీ నాయకులు రోజుకోక డ్రామా ఆడుతున్నారని.. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆనాడు అనలేదా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. ఆదివారం నాడు నర్సాపూర్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షో లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ఈ సభకు భారీగా తరలివచ్చిన జనాలను చూస్తే సునీతరెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తుంది. 2014 ముందు కరెంట్‌ కోసం పడ్డ కష్టాలు గుర్తుంచు కోండి. కరెంటు కష్టాలు కాంగ్రెస్‌ నాయకులకు తెలియదు. బీసీ బిడ్డ గొంతు కోసి కాంగ్రెస్‌ టికెట్‌ అమ్ముకున్నాడు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ ఉంటే కరెంట్‌ ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్‌ ఉండదు. కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వాలి అని కాంగ్రెస్‌ అనలేదా. రేవంత్‌రెడ్డి రైతుబంధు దుబారా అని అనలేదా అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 70లక్షల రైతుల ఖాతాల్లో 73000 కోట్లు వేసిన ఘనత కేసీఆర్‌ది. తెలంగాణను నష్టం చేసిన వారు ఒక్క ఛాన్స్‌ అని వచ్చి అడుగుతున్నారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో కామారెడ్డిలో ఓడిపోతాడని చెప్పారు.  రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, రైతు బీమా, ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. 400 సిలిండర్‌ 1200 వందల రూపాయలు చేసిన ఘనత మోదీది, తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత కేసీఆర్‌ది. అసైన్డ్‌ భూములను కేసీఆర్‌ పట్టాలు చెయబోతున్నారని హావిూ ఇచ్చారు. సునీతరెడ్డి గెలిపిస్తే నర్సాపూర్‌కు ఐటీ హబ్‌, పరిశ్రమలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ చేపడతా మన్నారు.  మదన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. బీఆర్‌ఎస్‌ నాయకులకు న్యాయమైన స్థానం కల్పిస్తాం. బీఆర్‌ఎస్‌ గెలిస్తే నర్సాపూర్‌ను చార్మినార్‌ జోన్‌లో కలుపుతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

(తెలంగాణకు సీఎం కేసీఆరే ఆపద్బాంధవుడు
` నవంబర్‌ 29న దీక్షాదివస్‌ నిర్వహిస్తాం:కేటీఆర్‌
` ఎక్కడికక్కడ పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్‌ 29 అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 14 ఏండ్లుగా నవంబర్‌ 29న దీక్షా దివస్‌ జరుపుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ విూడియాతో మాట్లాడారు. ఈ ఏడాది దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీక్షా దివస్‌లో తెలంగాణ ప్రజలంతా ఎక్కడికక్కడ పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆరోజున బీజం పడిరదన్నారు. తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తపెట్టిన నేత కేసీఆర్‌ అని చెప్పారు. ఆత్మగౌరవ విశ్వరూపం చూపించి.. పట్టుదలతో తెలంగాణ సాధించారన్నారు. ఢల్లీి మెడలు వంచి కేసీఆర్‌ తెలంగాణ సాధించారని చెప్పారు. ఢల్లీి నుంచి గల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి అన్నారు. రైతు బంధు పథకం కేసీఆర్‌ పేటెంట్‌ అని చెప్పారు. రైతు బంధు కొత్త స్కీం కాదని.. కొనసాగుతున్న పథకమన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు వేస్తే రేవంత్‌ రెడ్డి ఎందుకు ఆగమవుతున్నాడని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్త శుద్ధిలేదన్నారు. పీఎం కిసాన్‌ నిధులు ఇస్తే తప్పు లేదుకానీ రైతు బంధు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీది అట్టర్‌ ఎª`లాప్‌ ప్రభుత్వమని చెప్పారు. ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాలం చెల్లిన కాంగ్రెస్‌ ఎంతవాగినా లాభం లేదని విమర్శించారు. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని చెప్పారు. రాహుల్‌ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఉద్యోగం చేసిన వ్యక్తి కాదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నదీ లేదన్నారు. తాను పరీక్షలు రాశానని, ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యానని చెప్పారు. తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం లేదని, ఉంటే చెప్పాలన్నారు. కర్ణాటకలో  ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హావిూ ఇచ్చారని, ఇప్పటి వరకు అక్కడ ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదని తెలిపారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. ఈసారి గోషామహల్‌లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని చెప్పారు. గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ డవ్మిూ అభ్యర్థులను పెట్టిందన్నారు. బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమే ఉందని తెలిపారు. ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము రేవంత్‌ రెడ్డికి లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే జరుగు తున్నాయనడం అవాస్తమవని, బీఆర్‌ఎస్‌ నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పారు.