కాంగ్రెస్‌ గెలిస్తే కరెంటు కష్టాలు

` ఆ పార్టీవి రaూఠా మాటలు
బయ్యారం ఉక్కు పరిశ్రమను సింగరేణికి ఇస్తాం
సంస్థ కార్మికులకు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రీయింబర్స్‌ చేస్తాం
ఉక్కు పరిశ్రమపై ఇతర దేశాల్లో ఆధ్యయనం చేశాం
కాంగ్రెస్‌ పాలకులు డిపెండెంట్‌ ఉద్యోగాలకు ఎసరు పెట్టారు
కార్మికుల కోసం వెయ్యికోట్లను పంచిన ఘనత తమదే
కాంగ్రెస్‌ పార్టీకి అభివృద్ధి, సంక్షేమం అంటే గిట్టదు
ఆ పార్టీ గెలిస్తే పేకాట క్లబ్లులు, పబ్‌లకు కొదవ ఉండదు
ప్రజాశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌
గోదావరిఖని,ములుగు,మంచిర్యాల(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన అనంతరం సింగరేణి సంస్థను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.శుక్రవారం గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు.గత పాలకులు ఊడగొట్టిన డిపెండెంట్‌ ఉద్యోగాలను తిరిగి ప్రవేశపెట్టామన్నారు.12వేల మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేవలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.పోగొట్టిన ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓర్తలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం రాకముందు (2014) సింగరేణి సంస్థ రూ.600కోట్ల లాభాలతో నడిచిందన్నారు.ప్రస్తుతం రూ.2200కోట్ల లాభాల్లో సింగరేణి సంస్థ ఉందని కేసీఆర్‌ తెలిపారు.ఇంత అభివృద్ధి చెందడానికి కారణం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళికలు అన్నారు.గతంలో సింగరేణి కార్మికులకు లాభాల వాటాను 16శాతం ఇస్తే..బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 35శాతం ఇచ్చిందన్నారు.అదే విధంగా రూ.1000 కోట్లను కార్మికులకు  బోనస్‌,అడ్వాన్స్‌ రూపేణా చెల్లించామన్నారు. సింగరేణి సంస్థ 49శాతం వాటాను కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టిందన్నారు.కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి.. కేంద్రానికి అప్పనంగా వాటాను అప్పగించిందని కేసీఆర్‌ ఆరోపించారు.  సింగరేణి సంస్థ గతంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే  ఉండేదని కేసీఆర్‌ గుర్తు చేశారు.రాష్ట్ర పునర్విభజన సమయంలో బయ్యారం ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం చేపట్టనుందని చట్టంలో పొందుపరిచారని సీఎం పేర్కొన్నారు.ఇప్పటి వరకు అతిగతీలేదన్నారు.గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ప్రారంభించటానికి ఇతర దేశాల్లో అధ్యయనం చేసిందన్నారు.బయ్యారం ఉక్కు పరిశ్రమను సింగరేణి సంస్థకు అప్పగిస్తామన్నారు.ఇది శుభపరిణామమన్నారు.దీనితో సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు.తద్వారా ఉక్కు పరిశ్రమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
సింగరేణి కార్మికులకు ఇన్‌కం ట్యాక్స్‌ రద్దు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఇన్‌కం ట్యాక్స్‌ రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు.ప్రస్తుతం సింగరేణి సంస్థలో భూగర్బ గనులు మూతపడుతున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పుతామని కేసీఆర్‌ తెలిపారు.పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకవచ్చామన్నారు.వాటిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నామన్నారు.ఈ పథకాలు కొనసాగాలంటే తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని ప్రజలను సీఎం కోరారు.నిరంతర విద్యుత్‌, రైతుబంధూ..రైతుభీమా..మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, మేజర్‌ ఇరిగేషన్‌, కళ్యాణలక్ష్మీ, షాధీముబారక్‌, ఆసర పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను అందించామన్నారు.ప్రధానంగా ధరణి పోర్టల్‌ ద్వారా ఒక ఇంచు భూమి కూడా కబ్జాకు గురికాదన్నారు.ధరణితో రైతుల ఖాతాల్లో పెట్టుబడి కింద రైతుబంధూ వేస్తున్నామన్నారు.కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే..తెలంగాణను ఆగం చేస్తారని కేసీఆర్‌ పేర్కొన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసర పింఛన్లు రూ.5వేలు చేస్తామని సీఎం పేర్కొన్నారు.రైతుబంధూ రూ.16వేలకు పెంచనున్నామన్నారు.ఎన్నికలు వస్తాయి..పోతాయి..ప్రజలు ఆగం..ఆగం కావద్దు…ఆలోచన చేయాలి..ఓటు వేయాలి.ఎంతోమంది ఎన్నోరకాలుగా చెబుతారు.వారి మాటలు నమ్మకుండా..పోటీచేస్తున్న వ్యక్తి(అభ్యర్థి) గుణగణాలు, మంచిచెడులు చూడాలని కేసీఆర్‌ ప్రజలకు సూచించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు పరిణతి రాలేదన్నారు.అభివృద్ధి చెందిన దేశాల్లో వివిధ మాద్యమాల ద్వారా ఎన్నికలపై విశ్లేషణ ఉంటుందన్నారు.ఏదో ఒకరోజు భారతదేశంలో కూడా వస్తుందన్నారు.గత పాలకులు, ప్రస్తుతం పాలిస్తున్న పాలకుల చేసిన అభివృద్ధి పనులు బేరీజు చేసుకోవాలన్నారు.మంచి వ్యక్తిని ఎన్నుకుంటనే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి చూడాలన్నారు.రామగుండం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కోరుకంటి చందర్‌ను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు. ఈ ప్రాంతంపై చందర్‌కు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని తెలిపారు.మరోసారి కారు గుర్తుకు ఓటువేసి బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు..
నాగజ్యోతి గెలిస్తే..ములుగుకు జ్యోతి
ములుగు:బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఏనాడు అభివృద్ది గురించి పట్టించుకోలేదని పరోక్ష విమర్శలు గుప్పించారు. ములుగు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’ఇక్కడ కొన్ని పనులు కావాల్సి ఉన్నది. ఎమ్మెల్యేగా నువ్వు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు గాక. తప్పకుండా ముఖ్యమంత్రిని కలవాలి. గవర్నమెంట్‌లో ఉన్నవాళ్లను కలవాలి, మాట్లాడాలి. విూ ఎమ్మెల్యే ఎన్నడూ రాదు. ఏం అడగదు. మాకు తోచినవి.. తెలిసినవి.. మా పార్టీవాళ్లు చెప్పిన పనులు చేసుడే తప్ప ఆమె వచ్చి ఎన్నడూ అడుగదు. ఏం చేసిర్రు విూరు అంటే.. ఏం చేయలేదు  విూ కాంగ్రెస్‌ పాలనలో మంచినీరు ఇచ్చారా? కాంగ్రెస్‌ పాలనలో కరెంటు ఇచ్చారా? రైతుబంధు ఇచ్చారా? మరి ఇవాళ ఇవన్నీ మేం ఇచ్చాం కదా? విూ కాంగ్రెస్‌ కాలంలో పోడు భూములు పంచారా? ఇవాళ మేం పంచినం కదా? మరి ఏం చేశారంటే..? నేను చెప్పేదంటే ఈ వాదులాటలు కాదు. జరగాల్సింది ప్రజల క్షేమం’ అన్నారు.ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం. ముఖ్యంగా సమస్యలు ఎక్కువగా ఉంటయ్‌. రోడ్లు, ఇరిగేషన్‌ అన్నీ చేసిపెడుతానని వాగ్ధానం చేస్తున్నా. బడే నాగజ్యోతి చరిత్ర విూకు తెలుసు. కాంగ్రెస్‌ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్‌కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడైండు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను విూ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హోదాకు వచ్చింది’ అన్నారు. నేను విూ అందరినీ కోరేది.. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను. నేను స్వయంగా విూతోని మాట్లాడుతాను. ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇవాళ నేను తిరిగేది 80వ నియోజకవర్గం కావొచ్చు. ఇంకో 20 తిరిగితే అయిపోతది. ఏం గాలి లేదు.. తుస్సుమన్నది. ఎక్కడా ఏం లేదు. అది వచ్చేది లేదు. సచ్చేది లేదు. లాస్ట్‌ టైమ్‌ గెలిపించకుంటే నేను విూ విూద అలుగలేదు. కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్‌ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగతయ్‌. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది.. ఇక్కడే పెరిగింది. కుటుంబ త్యాగాలు విూకు తెలుసు. అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. విూకు కావాల్సిన పనులన్నీ చేసినపెడుతాను’ అని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు.
కాంగ్రెస్‌వి రaూఠా మాటలు
మంచిర్యాల:కాంగ్రెసోళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపించండి.. నేను బీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారట. అదంతా అవాస్తవం, రaూటా ముచ్చట అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని, దివాకర్‌ రావుకు మద్దతుగా ప్రసంగించారు. విూ దగ్గర కాంగ్రెసాయన గెలిస్తే విూకు వాడకట్టుకో పేకాట కబ్ల్‌. మంచిర్యాల నిండా పేకాట క్లబ్బులు.. ఇక క్లబ్బులకు కొదవ ఉండదు. ఇండ్లు అమ్ముకోవాలి పేకాటలో పెట్టాలి. చాలా ప్రమాదం సుమా.. దెబ్బతింటరు. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. ఇక కాంగ్రెస్‌ నాయకులు కొత్త పద్దతి మొదలుపెట్టారు. నన్ను గెలిపించండి నేను బీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అవుతా అని అంటున్నరట. ఇక్కడ ఉన్నాయన కూడా అట్లనే చెప్తున్నడట.. నాకు వార్త వచ్చింది. అదేం లేదు. అదంతా అబద్దం, రaూటా ముచ్చట. ఏదన్న లంగతనం చేసి గెలవాలనే బద్మాష్‌గిరి తప్ప అది వాస్తవం కాదు. మేం పదేండ్లు కష్టపడి అన్ని రంగాల్లో నంబర్‌వన్‌లో ఉన్నాం. ఎల్లమ్మ కూడబెడితే మల్లమ్మ మాయం చేసిందనట్టు ఈ పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతది. దివాకర్‌ రావు గెలిస్తే మంచి లాభం జరుగుతది. దివాకర్‌ రావు నన్ను ఎప్పుడూ వ్యక్తిగత పనులు అడగలేదు. పొలాలకు నీళ్లు రావాలి. లిఫ్టులు కావాలని అడిగారు. గోదావరిపై కరకట్ట కట్టి మంచిర్యాలకు చుక్క వరద నీరు రాకుండా చేసే బాధ్యత నాది. ఆ పని కూడా చేస్తాం. అవసరమైతే ఈ ఎండాకాలంలో మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేయిస్తాం. దివాకర్‌ రావును గెలిపిస్తే మంచి జరుగుతది అని కేసీఆర్‌ తెలిపారు.