కాంగ్రెస్ చేతికి తెలంగాణ
` 64 స్థానాల్లో హస్తం అభ్యర్థుల జయకేతనం
` 39 స్థానాలకే పరిమితమైన భారాస
` 8 స్థానంలో బీజేపీ గెలుపు.. ఒక స్థానంలో దక్కించుకున్న సీపీఐ
` విజయసారధి రేవంత్‌రెడ్డికే పగ్గాలు?
` ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా.. ఆమోదించిన గవర్నర్
` ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి నిరాశ ఎదురైంది. హస్తం పార్టీ విజయం సాధించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఇది తొలి ఓటమి కాగా..కాంగ్రెస్ పార్టీ (రాష్ట్ర ఆవిర్భావం తర్వాత) తొలిసారి అధికారంలోకి రాబోతోంది. గత ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొందిన భారాస ఈసారి 40 స్థానాలకే పరిమితమైంది. సీఎం కేసీఆర్ సహా, పలువురు మంత్రులకు ఈ క్రమంలో చేదు అనుభవం ఎదురైంది. పలువురు మంత్రులు గట్టెక్కినా మునుపటి మెజారిటీ మాత్రం అందుకోలేకపోయారు.ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సీఎం కేసీఆర్. గజ్వేల్‌లో మరోసారి విజయం అందింది. కానీ కామారెడ్డిలో నిరాశ ఎదురైంది. ఇక్కడ భాజపా అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.గత సారి మంత్రులుగా పనిచేసిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబిత, గంగుల మరోసారి గెలుపొందారు. తలసాని, సబితా ఇంద్రారెడ్డి మెజారిటీలు గతం కంటే మెరుగయ్యాయి. సబిత గత ఎన్నికల్లో దాదాపు 9 వేల ఓట్లతో గెలుపొందగా.. ఈ సారి మెజారిటీ 26 వేలకు పెరిగింది. తలసాని గతంలో 30వేల మెజారిటీతో గెలుపొందగా.. ఈ సారి 41వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సిద్దిపేట నుంచి పోటీ చేసిన మంత్రి హరీశ్ రావు మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో 1.18 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన.. ఈసారి 82వేల మెజారిటీకి పరిమితమయ్యారు. సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కేటీఆర్ గతంలో 89వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. ఈ సారి 30వేల ఓట్లకు పరిమితయ్యారు. మేడ్చల్ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి గత ఎన్నికల్లో 87 వేల ఓట్లతో గెలుపొందగా.. ఈసారి 33వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గంగుల కమలాకర్ 14వేల ఓట్లతో గెలుపొందగా.. ఈసారి కేవలం 300 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌పై విజయం సాధించారు.
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. నేడు సీఎల్పీ సమావేశం
కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్టు సమాచారం.గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం డీకే శివకుమార్ విూడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం 9.30గంటలకు సీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడిరచారు.
సీఎంగా రేవంత్‌రెడ్డి ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. దీంతో 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.ఈనేపథ్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈమేరకు ప్రమాణ స్వీకారోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ నుంచి ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్యనేతలంతా హాజరయ్యే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ సోమవారం ఉదయం సీఎల్పీ నేతను ఎన్నుకోనుంది. ఇందుకోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశం ఏర్పాటు చేయగా.. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఏఐసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ సాగనుంది.
ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా.. ఆమోదించిన గవర్నర్
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారాస ఓటమి చవిచూసింది. ఈనేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు.కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి
` ఈ సారి ఆరుగురు బీఆర్‌ఎస్ మంత్రులకు షాక్
సీఎం కేసీఆర్‌కు ఈసారి చేదు అనుభవం ఎదురైంది.అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సీఎం కేసీఆర్. గజ్వేల్‌లో మరోసారి విజయం అందింది. కానీ కామారెడ్డిలో నిరాశ ఎదురైంది. ఇక్కడ భాజపా అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.గత సారి మంత్రులుగా పనిచేసిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబిత, గంగుల మరోసారి గెలుపొందారు. తలసాని, సబితా ఇంద్రారెడ్డి మెజారిటీలు గతం కంటే మెరుగయ్యాయి. సబిత గత ఎన్నికల్లో దాదాపు 9 వేల ఓట్లతో గెలుపొందగా.. ఈ సారి మెజారిటీ 26 వేలకు పెరిగింది. తలసాని గతంలో 30వేల మెజారిటీతో గెలుపొందగా.. ఈ సారి 41వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఈ సారి ఎన్నికల్లో ఆరుగురు మంత్రులకు షాక్ తగిలింది. ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకుర్తి), నిరంజన్ రెడ్డి (వనపర్తి), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్) ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్లతో గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్.. ఈసారి మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 53 వేల ఓట్లతో గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో 51 వేల ఓట్లతో గెలుపొందిన మంత్రి నిరంజన్ రెడ్డి.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి టి.మేఘారెడ్డి చేతిలో ఓటమి పాలవ్వగా.. గతసారి 57 వేలతో గెలుపొందిన శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు.