కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…

–రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది
– టిపిసిసి సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్

కురివి అక్టోబర్-7
(జనం సాక్షి న్యూస్)

కురవి మండలం తాళ్లసంకీసా గ్రామ శివారు వస్రాంతండ గ్రామంలో ఇతర పార్టీ నుండి 100 కుటుంబాలు ఎస్టీ సెల్ నాయకుడు,అంగోత్ బాలకృష్ణ,ఎస్టీ సెల్ సెక్రటరీ కర్నావత్ గాంధీ నాయక్  ఆధ్వర్యంలో డోర్నకల్ నియేజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యలు,టీపిసిసి సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు…. ఈ సందర్భంగా నెహ్రూ నాయక్ మాట్లాడుతూ 2023 లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో భారీ చేరికలు ఉంటాయని అన్నారు….టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తి హామీలు నెరవేర్చాలేదు అని, ఈ ప్రభుత్వంలో  అధిక రెట్లు పెరిగాయని,సామాన్యులు బతకలేని పరిస్థితి లో ఉన్నారని అన్నారు.డోర్నకల్ గడ్డ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని, రాహుల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ  వరంగల్ డిక్లేరేషన్ ఇచ్చిన హామీని అమలు చేస్తామని, డోర్నకల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కురవి మండల బాధ్యలు వద్దుల మహేందర్ రెడ్డి,మండల నాయకులు శ్యామల శ్రీనివాస్,వెంకన్న,వీరు నాయక్,రాందాస్ సోషల్ మీడియా ఇంచార్జ్ గుగులోత్ నవీన్,విజయ్,రాజఫుట్ ,లాలు నాయక్,గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

2 Attachments • Scanned by Gmail