*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు*

బయ్యారం,జూన్ 02(జనంసాక్షి):

గురువారం  బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్య మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కాలని సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ గారికి తెలంగాణ ప్రజలు రుణ పడి ఉంటారని నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణాని కేసీఆర్ కుటంబపాలన తో రాష్టాన్ని అప్పుల కుప్ప చేసి నియంత పాలన సాగిస్తున్నాడని రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ లో అధికారములోకి తీసుకువచ్చి సోనియాగాంధీ గారికి బహుమానం ఇవ్వలని కోరారు.ఈ కార్యక్రమంలో బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రామునాయక్.సొసైటీ డైరెక్టర్ కేతమల్లు.కిసాన్ కేత్ మండల అధ్యక్షులు టి.లింగయ్య.దామోదర్ రెడ్డి.బాలాజిపేట గ్రామ అధ్యక్షుడు కోడి శ్రీనివాస్.వెంకట్రాంపురం గ్రామశాఖ అధ్యక్షుడు వల్లల వెంకన్న,బండి యాదగిరి, ఆకునూరి సూర్యనారాయణ.నరేష్,రామగిరి వెంకటేశ్వర్లు పాల్గోన్నారు.