కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస మంత్రులారా ఖబర్దార్:బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ

*కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస మంత్రులారా ఖబర్దార్:బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ*
బయ్యారం, జూన్ 08(జనంసాక్షి ):
బుధవారం బయ్యారం మండల కాంగ్రెస్ కార్యాలయం లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య మాట్లాడుతూ…మంగళవారం  బయ్యారం మండలంలో 5 వ పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి,శంకుస్థాపనల పేరుతో బయ్యారం మండలానికి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిజన శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ,ఎంపీ కవిత,ఎమ్మెల్యే హరిప్రియ,జిల్లా పరిషత్ చైర్మన్ బిందు, తదితరుల రావడంలో భాగంగా గాంధీ సెంటర్లో మహబూబాబాద్ జిల్లా ఎర్ర కంబాలపల్లికి చెందిన బద్ధుల మంగమ్మ టూరిజం బస్సుకింద పడి చనిపోతే కనీసం పంచనామా నిర్వహించకుండా శవాన్ని అక్కడ నుండి తరలించడం సిగ్గుచేటు అని,ఓట్లేసిన ప్రజలపై తెరాస నాయకులకు చిత్త శుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు.
చనిపోయిన బద్ధుల మంగమ్మకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా  చెల్లిచాలని బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ డిమాండు చేస్తుందని అన్నారు.
బయ్యారం లో జరిగిన బహిరంగ సభలో ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాల్లోకి రాకుండ తరిమి కొట్టాలని అనడం అవివేకం,సిగ్గుచేటు అని,
కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత తెరాస పార్టీ ఎర్రబెల్లికి లేదన్నారు.సమైక్యాంధ్ర వాది, తెలంగాణ ద్రోహి,దొడ్డిదారిన మంత్రిపదవి అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్షించడం అంటే సూర్యునిపై ఉమ్మివేయడమేనని,
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై అవాకులు-చెవాకులు మాట్లాడితే ప్రజలే మీకు సరైన టైం లో బుద్ధి చెబుతారన్నారు.బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…
2023 లో తెలంగాణ ప్రజలు మీకు సరైన గుణపాఠం చెబుతారని,మీకు చేతనైతే ఎస్కార్ట్ లేకుండా ప్రజల్లో తిరగండి మీకు తగిన బుద్ది చెప్తారన్నారు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు  చెయ్యాలని  దొంగ దీక్షలతో యువతని ప్రజల్ని మభ్యపెడుతున్న మీకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
వైకుంట దామలు,పల్లెపకృతి వనం తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు.
బయ్యారం పెద్ద చెరువు కాల్వలు మరమ్మతులు చెయ్యాలని, 2018 నుండి మండల రైతులు కోరుతున్న ఇల్లందు ఎమ్మెల్యే  చేసిన అభివృద్ధి ఏమిటీ అని,
అబివృద్ది పేరుతో నమ్ముకున్న పార్టీని తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చిన ఎమ్మెల్యే, నమ్ముకున్న ఓటర్లకు ఏమి అబివృద్ది చేసిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి,బయ్యారం వార్డు మెంబర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తగిర సత్తిరెడ్డి, కిసాన్ కేత్ జిల్లా నాయకులు కొయ్యగురి రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.