కాంగ్రేస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన – డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రూ నాయక్

కురవి మండలం రేకులతండా గ్రామంలో గురువారం రైతు రచ్చబండ కార్యక్రమం,కాంగ్రేస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రూ నాయక్ .గ్రామ ప్రజలు నెహ్రు నాయక్ కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నెహ్రూ నాయక్ మాట్లాడుతూ రైతుల కోసమే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారని,కాంగ్రేస్ పార్టీ తోనే అబివృద్ది సాధ్యమని తెలిపారు,ఇందిరా గాంధీ మహిళల రిజర్వేషన్ తెచ్చారని,కాంగ్రేస్ పార్టీ అధికారం లో రాగానే 2లక్షల రుణమాఫీ చేస్తామని,ఎకరాకు 15వేలు రైతుబందు ఇస్తామని,ధరణిపోర్టల్ రద్దుచేస్తామని,వరంగల్ డిక్లరేషన్ ను ప్రజలకు వివరించారు,2023 లో కాంగ్రేస్ పార్టీ అధికారం లో వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురవి మండల భాద్యులు డివై గిరి,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామల శ్రీనివాస్ ,గుగులోతు లాలూ నాయక్,రాజపుత్ నాయక్,గంటా యాకేశ్ యాదవ్, మాలోతు హరిలాల్,గ్రామ నాయకులు బిచ్చా సాధు,జైల్ సింగ్,గ్రామ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,రైతులు బారి సంఖ్యలో పాల్గొన్నారు.