కాంట్రాక్ట్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఎన్నికలు జరపవద్దు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 07 :
కేశోరామ్ యజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు రావలసిన డిమాండ్ల పైన యాజమాన్యం పనులు చేయకపోగా ఎలక్షన్ నిర్వహిస్తామని తెలియజేసిన సందర్భంగా కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో యాజమాన్యం మొండి వైఖరిని వీడి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని తర్వాతనే ఎలక్షన్ కి వెళ్లాలని కరాకండిగా యజమాన్యం వారికి కార్మికులు తెలియజేయడం జరిగింది.
లేనిపక్షంలో కాంట్రాక్ట్ కార్మిక సోదరులు పనులు అయ్యేవరకు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఎంతటి న్యాయ పోరాటానికైనా మేం సిద్ధమే అని కాంట్రాక్ట్ కార్మికులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ దాడి పోచమల్లు, తిప్పని శ్రీనివాస్, షకీలా, కటుకూరి సురేష్, ముల్కల రాజేశం, తలారి శంకర్,కత్తర్ల సతీష్, దేవి శ్రీనివాస్, రెడపాక మల్లేశం, తీగల తిరుపతి, కట్ల సంపత్, చిలగాని రాజేష్, కలవేన మల్లేశం,మబ్బు లక్ష్మణ్, దేవి శ్రీనివాస్,కలవెన కొమరయ్య, గొల్ల శ్రీనివాస్, ముల్కల తిరుపతి, సందమేనా పోశం, కలవేన స్వామి,బండారి కుమార్, బాడీ మెంబర్స్, అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మిక సోదరులు తదితరులు పాల్గొన్నారు.