కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: బి అయోధ్య
కాంట్రాక్టు కార్మికుల సమ్మె సింగరేణి యాజమాన్యానికి పట్టదా..
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి
🔸కాంట్రాక్టు కార్మికుల దీక్షను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 25 (జనం సాక్షి): మణుగూరు లోని రైల్వే గేటు వద్ద సింగరేణి కాంటాక్ట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య ఆదివారం సందర్శించి మద్దతు ప్రకటించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత16 రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తూ ఇబ్బందులు పడుతుంటే సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పట్టవా.. అని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులు చాలీచాలని జీతాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారని కనీస వేతనం 18000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని సింగరేణి యాజమాన్యం అమలుపరచడంలో కాలయాపన చేస్తుందన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు ఆకాశాన్ని అందుతున్నాయని సామాన్యుడు బ్రతకాలంటే బతుకు భారంగా ఉందన్నారు కాంట్రాక్టు కార్మికులు న్యాయమైన హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారని వారికి సిపిఐ పార్టీ అండగా నిలుస్తుందని వారి న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యేంతవరకు ఏఐటియుసి, సిపిఐ అండగా ఉంటుందని అన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులు 16 రోజులుగా కోల్బెబెల్ట్ ఏరియాలో సమ్మె చేస్తుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ,వెంటనే సమ్మె పై ప్రభుత్వం దృష్టికి వెళ్లి చర్చలు జయప్రదంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కాంటాక్ట్ కార్మికుల సమ్మె సింగరేణి యాజమాన్యానికి పట్టదా..
సింగరేణి కంపెనీలో కాంటాక్ట్ కార్మికులు ఎంతో కాలంగా వందల మంది పనిచేస్తున్నారు. తద్వారా కంపెనీకి ఎన్నో లాభాలు తెచ్చిపెట్టారు. ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించటానికే ఇన్ని రోజులైనా ఎందుకు స్పందించడం లేదు. ఒక వ్యక్తి రోజువారి కూలి పనికి వెళ్తే 500 నుంచి 700 వరకు ఇస్తున్నారు. వారు అడిగే న్యాయమైన డిమాండ్లు కూడా అంతకుమించి లేవని అధికారులకు తెలియడం లేదా… ఈరోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం బతకాలంటే రూ.18000 సరిపోవు అయినా అంతకుమించి ఆశించటం లేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు గ్యాస్ పెట్రోల్ ,ఇంటి కిరాయి ,పిల్లల చదువులు ఆరోగ్య సమస్యలు వస్టే ఇవన్నీ తట్టుకొనే శక్తి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. రోజు రోజుకు ఆకాశాన్ని అంటే ధరలతో అవని పై సామాన్యుడు బ్రతకాలంటే బతుకు భారంగా ఉందని అన్నారు.16 రోజులుగా మహిళలు, వృద్ధులు సమ్మెలో పాల్గొన్నారు వాళ్ల గోస గోడు అధికారులకు పట్టడం లేదా ఇకనైనా అధికార పార్టీ నాయకులు, సింగరేణి యాజమాన్యం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి జీవితాల్లో పండుగ వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిపిఐ మణుగూరు మండల ,పట్టణ కార్యదర్శి లు దుర్గాల సుధాకర్ జంగం మోహన్ రావు ,జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, రైతు సంఘం జిల్లా నాయకులు మంగి వీరయ్య , బొగ్గు ముఠా సంఘం కార్యదర్శి జక్కుల రాజబాబుకాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ నాయకులు నాగేశ్వరరావు ,గద్దల శ్రీనివాసరావు ,నాగేశ్వరరావు, గౌస్ పాషా ,పొదిలి వీరభద్రం, తదితరులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు