కాండం తొలుచుపురుగు నివారణకు చర్యలు…..కాండం తొలుచుపురుగు నివారణకు చర్యలు…..

చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండలంలోని సోమక్కపేట గంగారం గ్రామాలలో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి పంట పొలాన్ని పరిశీలించడం జరిగింది. ఈసందర్భంగా ఏవో బాల్ రెడ్డి మాట్లాడుతూ వరి పంట పొలాల్లో ప్రస్తుత దశలో కాండం తొలుచు పురుగు అలాగే అగ్గి తెగులు పంటకు సోకి అధికంగా నష్టపరుrస్తూ ఉందని గమనించామన్నారు. కాండం తొలుచు పరుగు నివారణ కొరకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2gr లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజాల్ 0.6 గ్రా.+ మాన్కోజెబ్ 0.25 గ్రా. లేదా కాసుగా మైసిన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అని రైతులకు తెలిపారు మండలంలోని రైతులు ప్రతి ఒక్కరూ ఇట్టి విషయాన్ని గమని పంట పొలాల్లో ముందుగా జాగ్రత్తగా తగు చర్యలను చేపట్టుకుని పంట పొలాలను సంరక్షించుకోవాలని అన్నారు ఈకార్యక్రమంలో ఏఈఓ భూపాల్, రైతులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.