కాకతీయసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గుండె శాస్త్ర చికిత్స చేసిన వైద్య బృందాన్ని సన్మానించిన టీఎన్జీవోస్ నేతలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)

 

వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్, కార్యదర్శి గాజె వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణా కు పెద్దదిక్కు అయినటువంటి కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో మొట్టమొదటిసారిగా గుండెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి విజయవంతం చేసిన వైద్య బృందం అయినటువంటి డాక్టర్ గోపాల్ రావు నోడల్ అధికారి, కార్డియాలజీ పర్యవేక్షకులు డాక్టర్ మమతా రెడ్డి, కారిడియాక్ సిటీ సర్జన్ డాక్టర్ అల్లాడి సృజన్, డాక్టర్ రిషిత్, అనస్థీషియా డాక్టర్ నాగార్జున రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, సిబ్బంది నర్సింగ్ సూపర్డెంట్ సుశీల బృందం ను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ తెలంగాణలో పేద ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజలకు వైద్యం పట్ల బరోసానిస్తు, సేవలందించాలని, భవిష్యత్తులో మరింత సేవలందించలనే ఉద్దేశంతో పనిచేసిన డాక్టర్ బృందానికి, అలాగే వరంగల్ ను హెల్త్ హబ్ గా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, గద్దల రాజు, వంశీధర్ బాబుసిటీ అధ్యక్షులు వెలిశాల రాజు,ఎం జిఎం అధ్యక్షులు రవికుమార్, కార్యదర్శి రవీందర్, నాగేశ్వరరావు, ఎం. డి. రఫీక్ ,చిరంజీవి మురళి సుదర్శన్ తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.