కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా వేడుకలు..
వరంగల్ జిల్లా లో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా కాకతీయ వైభవ సప్తాహం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ గోపి, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ తెలిపారు.
మంగళవారం జులై 7 నుండి ప్రారంభం కానున్న వేడుకలను పురస్కరించుకొని వరంగల్ కోటలోని వేడుకల ప్రాంగణాలను కలెక్టర్ కమిషనర్ ఎమ్మెల్యే పరిశీలించారు. కాకతీయ వైభవ సప్తాహం ఏడు రోజుల పాటు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ద్వారా చేపట్టబోయే ఏర్పాట్లను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి,జి డబ్ల్యూ ఎం సి కమిషనర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నరేందర్,
అదనపు కలెక్టర్ హరి సింగ్ ఇతర జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు . అనంతరం కోట ప్రాంగణం ముందుభాగంలో షామియానాలు, ట్రాఫిక్ సమస్యలు,ముఖ్య అతిథులుగా ఆహ్వానించుట సంబంధిత విషయాలపై చర్చించారు.
కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ బి గోపి మాట్లాడుతూ కాకతీయ చరిత్రను ప్రజలకు తెలిపే విధంగా కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను ఒక ప్రణాళిక వేసుకుని కాకతీయ హిస్టరీ పై సెమినార్స్, పెయింటింగ్ ,వ్యాసరచన మొదలగు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాస్త్రీయ నృత్యాలు, డాన్సులు, కవి సమ్మేళనం నాటకాల రూపంలో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసే విధంగా 7 రోజులు కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
కాకతీయుల వైభవ సప్తాహం కార్యక్రమాన్ని ఉద్దేశించి వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కాకతీయ వైభవ సప్తాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వారి సూచనలు సలహాలు మేరకు జూలై , 7వ తారీకు నుండి, ఏడు రోజులు, 700 సంవత్సరాల చరిత్రను తెలుసుకోనున్నారు, ఈ విధంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో కాకతీయుల కళా వైభవాన్ని మరోసారి ఈ ప్రాంత ప్రజలకు కనుల విందు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు
జిల్లా పాలనాధికారి వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
కాకతీయ రాజుల విస్తరణ, వారు చేసిన
అభివృద్ధి… ఈ ఏడు రోజుల కార్యక్రమాలలో చెప్పుకోవడం జరుగుతుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదర్శంగా తీసుకుని గొలుసుకట్టు చెరువులు, ఆలయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
కాకతీయుల తోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిహ్నంగా అమలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.