-->

 కాబుల్‌లో మిలిటరీ ఆస్పత్రిపై బాంబు దాడి, 19 మంది మృతి

కాబుల్‌: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతంలో మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదులు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ మిలిటరీ ఆస్పత్రిపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.